ఫిర్యాదుదారులను గౌరవించాలి : ఎస్పీ
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:21 PM
పోలీస్‌స్టేషన్‌కు ఎంతో బాధతో బాధితులు వస్తుంటారని, వారిని మరింత బాధ పెట్టకుండా వారిపట్ల మర్యాదపూర్వగా గౌరవంగా నడుచుకోవాలని ఎస్పీ జానకి అన్నారు.
మహబూబ్‌నగర్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : పోలీస్‌స్టేషన్‌కు ఎంతో బాధతో బాధితులు వస్తుంటారని, వారిని మరింత బాధ పెట్టకుండా వారిపట్ల మర్యాదపూర్వగా గౌరవంగా నడుచుకోవాలని ఎస్పీ జానకి అన్నారు. బాధితులకు ధైర్యం ఇచ్చేలా మన ప్రవర్తన ఉండాలని సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బాధితుల నుంచి 11 ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇది వరకు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు స్టేటస్ అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, అన్ని ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, వాటిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రజావాణి ద్వారా అధికారులకు తెలియజేయడంతో సమస్య వేగంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందన్నారు.