మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలి
ABN , Publish Date - May 29 , 2025 | 11:05 PM
మార్కెట్ ధరల ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నట్లు తహసీల్దార్ సతీష్‌కుమార్ తెలిపారు.
- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్
మక్తల్ రూరల్, మే 29 (ఆంధ్రజ్యోతి): మార్కెట్ ధరల ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నట్లు తహసీల్దార్ సతీష్‌కుమార్ తెలిపారు. గురువారం పేట, కొడంగల్ ఎత్తిపోతల్లో భాగంగా మండలంలోని కాట్రేవ్‌పల్లి, ఎర్నాన్‌పల్లి, మంతన్‌గోడ్, కాచ్‌వార్, టేకులపల్లి గ్రామాల్లో తహసీల్దార్ ఆధ్వ ర్యంలో గ్రామసభలు నిర్వహించగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి వారి డిమాండ్లను పరిశీలించారు. కాట్రేవ్‌పల్లిలో రైతులు మాట్లాడుతూ మార్కెట్ ధర ప్రకారం తమకు నష్టపరిహారం చెల్లించాలని, లేకపోతే ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని, దీంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాచ్‌వార్, టేకుల పల్లి రైతులు పైపులైన్లతో కాకుండా ఓపెన్ కెనాల్‌తో నీటిని తరలించాలని కోరుతూ అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్య క్రమంలో ఇరిగేషన్ ఏఈ నాగశివ, వ్యవసాయ అధికారి మిథున్‌చక్రవర్తి, ఇతర సిబ్బంది పాల్గొ న్నారు.