అచ్చంపేటలో కమ్యూనిటీ కాంటాక్ట్
ABN , Publish Date - Nov 05 , 2025 | 11:21 PM
నాగర్‌కర్నూల్ జి ల్లా, అచ్చంపేట పట్టణంలో బుధవారం తెల్లవారుజామున పోలీసు శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
- శివసాయినగర్ కాలనీలో పోలీసుల తనిఖీలు
- 60 ద్విచక్ర వాహనాలు, కారు, బోలెరో స్వాధీనం
అచ్చంపేట టౌన్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ జి ల్లా, అచ్చంపేట పట్టణంలో బుధవారం తెల్లవారుజామున పోలీసు శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని శివసాయినగర్ కాలనీలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ నాగరాజు, ఎస్‌ఐలు సద్దాం హుస్సేన్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిం చారు. సరైన ధ్రువపత్రాలు లేని 60 బైక్‌లు, ఒక కారు, ఒక బొలెరో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మా ట్లాడుతూ పట్టణ శివారు కాలనీల్లో తరుచూ దొంగతనాలు జరుగు తున్నాయన్నారు. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించుకున్న ఇళ్లకు సెంట్రల్ లాక్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కాలనీ ల్లో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే 100 నెంబర్‌కు ఫోన్ చేయాలని, లేదా ఎస్‌ఐ, సీఐలకు సమాచారం అందించాలని సూచిం చారు. తమ సిబ్బంది తక్షణమే స్పందిస్తారని చెప్పారు. కాలనీల్లో అందరి సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలకు సరైన ధ్రువపత్రాలను సమర్పిస్తే తిరిగి అప్పగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో 8 మంది ఎస్‌ఐలు, 60 మంది పోలీసులు పాల్గొన్నారు.