Share News

కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు కమిటీలు

ABN , Publish Date - May 15 , 2025 | 10:54 PM

రాష్ట్రంలో కాం గ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు అన్ని స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు టీపీసీసీ పరిశీలకుడు వేణుగౌడ్‌, సంధ్యారెడ్డి, నారాయణపేట నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం శివకుమార్‌రెడ్డి తెలిపారు.

కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు కమిటీలు
సమావేశంలో మాట్లాడుతున్న టీపీసీసీ పరిశీలకులు వేణుగౌడ్‌

- టీపీసీసీ పరిశీలకులు వేణుగౌడ్‌

నారాయణపేట, మే 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాం గ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు అన్ని స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు టీపీసీసీ పరిశీలకుడు వేణుగౌడ్‌, సంధ్యారెడ్డి, నారాయణపేట నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం శివకుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం నారాయణపేట సీవీఆర్‌ భవన్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన నారాయణ పేట మండలం, పట్టణ, దామరగిద్ద మండలాల కొత్త కమిటీల ఏర్పాటు కోసం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పార్టీ పదవుల నియామకం పారదర్శకంగా జరగాలనే ఉద్ధేశంతో ప్రతీ మండలం నుంచి మండల అధ్యక్ష పదవి కోసం దరఖాస్తులు తీసుకుంటామని తెలిపారు. వచ్చిన వాటిలో అర్హులైన వారిని ఎంపిక చేసి అధి ష్ఠానానికి పంపించడం జరుగుతుందన్నారు. అర్హులను అధిష్ఠానం ఎంపిక చేస్తుందన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. గ్రామ, వార్డు అధ్యక్షుల ఎంపిక సైతం ఉంటుందని, ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పదవులు దక్కని వారికి వచ్చే స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామన్నారు. పదవులు పొందిన వారు అందరినీ కలుపుకుపోయి పార్టీ పటిష్టతకు పాటుపడాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. అనంతరం అధ్యక్ష పదవులకు పోటీపడే వారినుంచి దరఖాస్తులు స్వీకరించారు. సమావేశంలో మార్కెట్‌ చైర్మన్‌ శివారెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండీ.సలీం, మాజీ మార్కెట్‌ చైర్మన్లు బండి వేణుగోపాల్‌, సుధాకర్‌, ఎండీ.గౌస్‌, గందె చంద్రకాంత్‌, కోట్ల రవీందర్‌రెడ్డి, సంతోష్‌, బాల్‌రెడ్డి, విండో చైర్మన్లు నర్సింహరెడ్డి, ఈదప్ప, ఆర్టీఏ బోర్డు మెంబర్‌ పోషల్‌ రాజేష్‌, మహేష్‌, అమీరొద్దీన్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - May 15 , 2025 | 10:54 PM