Share News

విద్యార్థులకు పాఠాలు బోధించిన కలెక్టర్‌

ABN , Publish Date - Oct 21 , 2025 | 11:31 PM

పదవ తరగతి పరీక్షల కోసం ఇప్పటినుండే కష్టపడి శ్రద్ధగా చదువుకుని వందశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్‌ బీఎం. సంతోష్‌ కస్తూర్బా విద్యార్థినులకు సూచించారు.

విద్యార్థులకు పాఠాలు బోధించిన కలెక్టర్‌
గట్టు కస్తూర్బాలో విద్యార్థులకు పాఠం బోధిస్తున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

  • గట్టు కస్తూర్బా పాఠశాల, ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీ

  • వందశాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచన

గట్టు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : పదవ తరగతి పరీక్షల కోసం ఇప్పటినుండే కష్టపడి శ్రద్ధగా చదువుకుని వందశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్‌ బీఎం. సంతోష్‌ కస్తూర్బా విద్యార్థినులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలతో పాటు ప్రభు త్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈసందర్బంగా కస్తూర్బా పాఠశాలలో తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. కాసేపు పాఠాలు బోధించారు. టెన్త్‌ విద్యార్థినులతో మావవ అభి వృద్ధి సూచిక, స్థూల జాతీయోత్పత్తి, రాజ్యాంగ ప్రస్తావన, పరిశ్రమలు, వ్యవసాయం, సేవా రం గాలు ఆదాయం సమానత్వం వంటి సాంఘిక శాస్త్రంలోని ముఖ్యమైన అంశాలను వివరించారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయుల కు సూచించారు. అనంతరం విద్యార్థుల హాజరు, కంప్యూటర్‌ ల్యాబ్‌ను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆయనతో పాటు ఎంపీడీవో చెన్నయ్య ఉన్నారు.

  • అందరికీ వైద్యసేవలు అందించాలి

ప్రభుత్వ అసుపత్రికి వచ్చే ప్రతీ ఒక్కరికి మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్‌ సంతోష్‌ వైద్యులను ఆదేశించారు. ఆస్పత్రిని ఆక స్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యసేవలను, సౌకర్యాలను పరిశీలించారు. సహజ ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. రోగులతో మాట్లాడి వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్యాదికారి సూర్యప్రకాష్‌, వైద్యసిబ్బంది ఉన్నారు.

Updated Date - Oct 21 , 2025 | 11:31 PM