Share News

పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్‌ అభినందన

ABN , Publish Date - Apr 30 , 2025 | 11:29 PM

నారాయణపేట జిల్లా పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 95.13 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో 19వ స్థానం నిలబెట్టినం దుకు కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ విద్యాశాఖను అభినందిస్తూ, హర్షం వ్యక్తం చేశారు.

పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్‌ అభినందన
అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను సన్మానించి, అభినందించిన కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, డీఈవో గోవిందరాజులు, విద్యాశాఖ సిబ్బంది

నారాయణపేటటౌన్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 95.13 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో 19వ స్థానం నిలబెట్టినం దుకు కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ విద్యాశాఖను అభినందిస్తూ, హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో 572 మార్కులతో కోస్గి జడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థినీ నిహారికను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే శివాజీనగర్‌ పాఠశాల విద్యార్థిని 564, కేజీబీవీ నారాయణపేట విద్యార్థిని దివ్య 541, శివలీల 541, అంకిత 534, కృష్ణ కేజీబీవీలో 568 మార్కులు సాధించిన రేఖను అభినందించారు. డీఈవో గోవిందరాజులు, సెక్టోరల్‌ అధికారులు, రాజేంద్రకుమార్‌, నాగార్జునరెడ్డి, నర్మద, ఆంజనేయులు, యాదయ్యశెట్టి, భానుప్రకాష్‌, కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్‌ లక్ష్మి, శాలిని, సునీత ఉన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 11:29 PM