సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
ABN , Publish Date - Nov 28 , 2025 | 11:02 PM
పలు అభివృద్ధి ప నులకు ప్రారంభోత్సవాల కోసం ముఖ్యమం త్రి ఎనుముల రేవంత్‌రెడ్డి డిసెంబరు 1వ తేదీన రానున్న సందర్భంగా అధికారులు ఏ ర్పాట్లలో నిమగ్నమయ్యారు.
అమరచింత/ఆత్మకూరు/మక్తల్, నవం బరు 28 (ఆంధ్రజ్యోతి) : పలు అభివృద్ధి ప నులకు ప్రారంభోత్సవాల కోసం ముఖ్యమం త్రి ఎనుముల రేవంత్‌రెడ్డి డిసెంబరు 1వ తేదీన రానున్న సందర్భంగా అధికారులు ఏ ర్పాట్లలో నిమగ్నమయ్యారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు, నారాయణపేట జిల్లా మక్తల్‌లో ఒకేరోజు సీఎం పర్యటించనున్నారు. వివరాలి లా ఉన్నాయి. ఆత్మకూరులో ముఖ్యమంత్రి పర్యటించే స్థలాలను, ప్రారంభోత్సవాల ప్రాంతాలను వనపర్తి జిల్లా అడిషనల్ ఎస్పీ వీరారెడ్డి, పలువురు అధికారులు పరిశీలించా రు. 100 కోట్ల పైచిలుకుతో ఆత్మకూరు మం డలం జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై ని ర్మించనున్న బ్రిడ్జి, ఆత్మకూరు శివారులో 50 పడకల ఆసుపత్రి భవనానికి, జాతర మైదా నంలో మినీ స్టేడియం నిర్మాణానికి మునిసి పాలిటీ అభివృద్ధికి 15 కోట్ల నిధుల పనులకు శంకుస్థాపనలు చే యనున్నారు. అడి షనల్ ఎస్పీతో పా టు జిల్లా అధికారు లు అప్పలనాయు డు, శ్రీనివాసులు, ఆత్మకూరు సీఐ శివకుమార్, ఎస్‌ఐ జయన్న తదితరు లు జాతర మైదా నంలో హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలిం చారు. అలాగే, నారాయ ణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ భద్రతా ఏర్పాట్లను పో లీస్ అధికారులు, మునిసిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మక్తల్ పట్టణంలోని బీసీ వె ల్‌ఫైర్ రెసిడెన్షియల్ మైదానంలో పబ్లిక్ మీ టింగ్ సమావేశ స్థలం హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి బందోబస్తుకు సం బంధించిన రూట్‌మ్యాప్‌ను ఏర్పాటు చేయా లని అధికారులకు ఆదేశించారు. డీఎస్పీ న ల్లపు లింగయ్య, పుర కమిషనర్ శ్రీరాములు, ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డి పాల్గొన్నారు.