నారాయణపేటపై సీఎం వివక్ష
ABN , Publish Date - Jul 20 , 2025 | 11:14 PM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నారాయణపేట జిల్లాపై వివక్ష చూపిస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు నాగూరావు నామాజీ అన్నారు.
- భూములు కోల్పోతున్న వారికి పరిహారం అందించాలి
- బీజేపీ నాయకుడు నాగూరావు నామాజీ
నారాయణపేట టౌన్, జూలై 20 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నారాయణపేట జిల్లాపై వివక్ష చూపిస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు నాగూరావు నామాజీ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో కొనసాగుతున్న అ గ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను పాలెం తరలించారని, జిల్లా కేంద్రంలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు అడ్డుపడుతున్నాని విమర్శించారు. కొడంగల్ నియోజకవర్గంలో తప్పించి నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రజలు ఏం పాపం చేశారో కానీ వారి కి వైద్య సేవలను సైతం దూరం చేశారన్నారు. రెండు నెలలుగా పట్టణ ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యసేవలు అందడం లేదన్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోతున్న రై తులకు న్యాయమైన నష్టపరిహారం ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ జిల్లాలో అత్యధిక స్థానాలను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో సోమవారం జిల్లా కేంద్రంలో కార్య కర్తల జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 26న రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీ డీకే అరుణ జిల్లా కేంద్రానికి రాను న్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, రతంగ్ పాండురెడ్డి, శ్రీనివాస్, పోషల్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.