Share News

సీఎంఆర్‌ లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Oct 09 , 2025 | 11:23 PM

రైస్‌మిల్లర్లు తమకు కేటాయించిన సీఎంఆర్‌ లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి ఆవుల స్వామికుమార్‌ ఆదేశించారు.

సీఎంఆర్‌ లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలి
అయిజలోని ఓ రైస్‌మిల్లులో పరిశీలిస్తున్న అధికారి స్వామికుమార్‌

- రైస్‌మిల్లర్లకు సూచించిన డీఎస్‌వో

- పలుచోట్ల మిల్లుల తనిఖీ

అయిజ, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): రైస్‌మిల్లర్లు తమకు కేటాయించిన సీఎంఆర్‌ లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి ఆవుల స్వామికుమార్‌ ఆదేశించారు. గురువారం ఆయన అయిజ పట్టణంలోని సత్యనారాయణ, ఈశ్వర, శ్రీనివాస రైస్‌మిల్లులను తనిఖీ చేశారు. మరో 20 రోజుల్లో జిల్లాలో వరి కోతలు ప్రారంభం అవుతాయన్నారు. ప్రస్తుతం మిల్లులలో స్థలా భావం ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రభుత్వానికి అందించాల్సిన బియ్యాన్ని పూర్తి స్థాయిలో అందించాలని చెప్పారు. కొత్తగా కొనుగోలు చేయనున్న వడ్లను నిల్వ చేసేందు కు మిల్లులలో అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఎక్కడా సమస్య రాకుం డా చూడాలని చెప్పారు. ఈసారి 2,50,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.

Updated Date - Oct 09 , 2025 | 11:23 PM