Share News

భూ నిర్వాసితుల కోసం సీఎం కాళ్లు మొక్కుతా..

ABN , Publish Date - Aug 17 , 2025 | 11:09 PM

మక్తల్‌, నారాయణపేట, కొడంగల్‌ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న భూ నిర్వా సితులకు న్యాయమైన పరిహారం కోసం ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి కాళ్లు మొక్కుతానని కాంగ్రె స్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం శివకు మార్‌ రెడ్డి అన్నారు.

భూ నిర్వాసితుల కోసం సీఎం కాళ్లు మొక్కుతా..
మాట్లాడుతున్న కుంభం శివకుమార్‌రెడ్డి

నారాయణపేట, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : మక్తల్‌, నారాయణపేట, కొడంగల్‌ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న భూ నిర్వా సితులకు న్యాయమైన పరిహారం కోసం ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి కాళ్లు మొక్కుతానని కాంగ్రె స్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం శివకు మార్‌ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఫంక్షన్‌ హాల్‌లో భూ నిర్వాసితుల రౌండ్‌ టేబు ల్‌ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతుకు భూమికి మధ్య ఉన్న సంబంధం విడదీ యలేనిదని, వెలకట్టలేని బంధం ఉన్నదన్నారు. భూ నిర్వాసితులకు తప్పకుండా న్యాయం జర గాలని కోరుకుంటున్నానని తెలిపారు. భూ ని ర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్షులు మశ్చందర్‌ అధ్యక్షత వహించగా భూ నిర్వాసితుల సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి భాస్కర్‌ మాట్లాడుతూ.. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం న్యాయమైన పరిహారం అందించాలని, అందుకు బేసిక్‌ ధరను నిర్ణయిం చడంలో మార్కెట్‌ ధరను ప్రాతిపదిక తీసుకో వాలని అన్నారు. కార్యక్రమంలో నర్సింహ, ప్ర శాంత్‌, ధర్మరాజు గౌడ్‌, బలరాం, భీంరెడ్డి, శెట్టి రమేష్‌, భీమ్‌రెడ్డి, మహేష్‌ కుమార్‌ గౌడ్‌, సు ధాకర్‌రెడ్డి, కేశవులు, కృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, చం ద్రశేఖర్‌, అంజి, భీమప్ప, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 17 , 2025 | 11:09 PM