Share News

హిందువులకు సీఎం క్షమాపణ చెప్పాలి

ABN , Publish Date - Dec 03 , 2025 | 11:08 PM

హిందూ దేవతల పట్ల చులకనగా వ్యాఖ్యానిం చిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హిందూవులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు డిమాండ్‌ చేశారు.

హిందువులకు సీఎం క్షమాపణ చెప్పాలి
గద్వాలలోని పాతబస్టాండ్‌ వద్ద నిరసన తెలుపుతున్న బీజేపీ శ్రేణులు

  • బీజేపీ జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు

గద్వాల టౌన్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): హిందూ దేవతల పట్ల చులకనగా వ్యాఖ్యానిం చిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హిందూవులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు డిమాండ్‌ చేశారు. సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నాయ కులు బుధవారం పట్టణంలోని పాతబస్టాండ్‌ సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడిన రామాంజనేయులు, పార్టీ అగ్రనా యకత్వం మెప్పు పొందేందుకే రేవంత్‌రెడ్డి హిం దూ దేవతల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశా రన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న హిందూ వ్యతి రేక, ముస్లిం అనుకూల ధోరణి ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో మరోసారి బహిర్గతమైందన్నారు. హిందువుల పట్ల వ్యతిరేఖభావం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల నుంచి గుణపాఠం తప్ప దన్నారు. గతంలో హిందుగాళ్లు బొందుగాళ్లు అంటూ అహంకారపూరిత వ్యాఖ్యల చేసిన కేసీ ఆర్‌ను ప్రజలు ఎన్నికల్లో బొందపెట్టారని, అదే గతి రేవంత్‌రెడ్డికి తప్పదన్నారు. మహిళా, యు వమోర్చా నిర్వహించిన కార్యక్రమంలో బండల వెంకట్రాములు, శ్యామ్‌రావు, రవికుమార్‌ ఎగ్బో టే, రజక జయశ్రీ, సుమత మధుగౌడ్‌, చిత్తారి కిరణ్‌, దేవదాసు, నరసింహ ఉన్నారు.

Updated Date - Dec 03 , 2025 | 11:08 PM