అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Oct 08 , 2025 | 10:49 PM
కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజల విశ్వాసం కోల్పోయిం దని, అబద్దాలకు బ్రాండ్ అంబాసి డర్ సీఎం రేవంత్‌రెడ్డి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వి మర్శించారు.
- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజల విశ్వాసం కోల్పోయిం దని, అబద్దాలకు బ్రాండ్ అంబాసి డర్ సీఎం రేవంత్‌రెడ్డి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వి మర్శించారు. బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమా వేశం గోపాల్‌పేట మండల నా యకులతో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలో నిర్వహిం చారు. సమావేశంలో మాజీ మంత్రి ముఖ్య అ తిథిగా హాజరై నాయకులకు, కార్యకర్తకలు దిశా నిర్దేశం చేశారు. ప్రతీ గ్రామ కమిటీ సమావే శమై ఓటరు జాబితాను పరిశీలించి కాంగ్రెస్ ఓటు చోరీని బహిర్గతం చేయాలని అన్నారు. వారు ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు ఎకరా నికి రూ.76వేలు, ప్రతీ మహిళకు రూ.50వేలు, వృద్ధులకు, దివ్యాంగులకు, పింఛన్ల బకాయి రూ.44వేలు, కల్యాణలక్ష్మితో తులం బంగారం, నిరుద్యోగుల 2 లక్షల ఉద్యోగాలు, విద్యా ర్థినులకు స్కూటీలు వంటివి మరిచారని, వీటిని ప్రజలకు వివరించి ఎన్నికలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ప్రజలకు విజ్ఞప్తి చేయాలని సూచించారు. అదేవిధంగా జిల్లా కేం ద్రంలో ప్యాటగడ్డ (20వ వార్డు)లో ఇంటింటికీ బాకీ కార్డులు మాజీ మంత్రి ఆధ్వర్యంలో పంపి ణీ చేశారు. కార్యక్రమంలో అశోక్, బాలరాజు, తిరుపతయ్య, చంద్రశేఖర్, తిరుపతిరెడ్డి, శ్రీని వాసులు, మతిన్, మాన్య నాయక్, శేఖర్, శ్రా వణ్ కుమార్, కర్రోళ్ల భాస్కర్, రవి, నాగరాజు పాల్గొన్నారు.