పేదలకు పెన్నిధి సీఎం సహాయ నిధి
ABN , Publish Date - Aug 10 , 2025 | 11:41 PM
ఆపదలో ఉన్న పేదలను ఆర్థి కంగా ఆదుకుంటున్న పేదల పెన్నిధి సీఎం సహాయ నిధి పథకమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
వనపర్తి టౌన్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఆపదలో ఉన్న పేదలను ఆర్థి కంగా ఆదుకుంటున్న పేదల పెన్నిధి సీఎం సహాయ నిధి పథకమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి పట్టణంలోని తన నివాసంలో రూ. 38,21,500 విలువ గల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తరువాత రికార్డు స్థాయిలో సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులను అందించామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ. 10 లక్షల వరకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందించడమే కాకుం డా ఆరోగ్యశ్రీ లేనివారికి సైతం అత్యవసర చికిత్స కోసం ఎల్‌వోసీలు, సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులతో ఆర్థిక ఉపశమనం కల్పిస్తున్నామన్నారు. నియో జకవర్గంలో పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేస్తు న్నామని తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.