ఇచ్చిన హామీలను సీఎం నెరవేర్చాలి
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:17 PM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పింఛన్‌దారులకు, ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశా రు.
- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
దేవరకద్ర, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పింఛన్‌దారులకు, ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశా రు. గురువారం మండల కేంద్రంలోని ఫంక్షన్‌హాల్‌లో వికలాంగుల పోరా ట సమితి, పింఛన్‌దారుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయ న హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో పింఛన్లను పెంచుతామని చెప్పి, 18 నె లలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవే ర్చకుండా మోసం చేయడం తగదన్నారు. నవంబర్ వరకు పింఛన్లు పెం చకపోతే హైదరాబాద్‌లో మహాగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.