చెంచుల మధ్య ఘర్షణ
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:55 PM
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని వివిధ చెంచుపంటలు- గ్రామాల్లో నివసిస్తున్న చెంచు గిరిజన ప్రజల మధ్యన వివాదం ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో నల్లమల ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
- పోలీసులకు పరస్పర ఫిర్యాదులు
- డీఎస్పీ ఆఽధ్వర్యంలో ఇరువర్గాలతో సంప్రదింపులు
అమ్రాబాద్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని వివిధ చెంచుపంటలు- గ్రామాల్లో నివసిస్తున్న చెంచు గిరిజన ప్రజల మధ్యన వివాదం ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో నల్లమల ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వివాదానికి రెండు వర్గాలకు చెంది న వారు వాట్సాప్ గ్రూపులలో మెసేజ్‌లు ఫార్వర్డ్ చేయడం ద్వారా ఒకరిపై ఒకరు ప్రత్యక్షంగా దాడులు చేసుకునే వరకు వెళ్లిందని చెప్పవచ్చు. మండల పరిధిలోని సార్లపల్లి మాజీ సర్పంచ్ చిగుల్రా మల్లికార్జున్‌పై శనివారం మన్ననూర్‌లో మరొక వర్గానికి చెందిన కొం తమంది దాడి చేశారని అనంతరం అమ్రాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫి ర్యాదు చేయటానికి వెళ్లిన సమయంలో కూడా ఘర్షణ నెలకొన్నట్లు తెలిసింది. జోక్యం చేసుకున్న పోలీసులు శనివారం రాత్రి సర్పంచ్ మల్లికార్జున్‌ను అదుపులోకి తీసుకొని ఆదివారం ఉదయం పెద్ద ఎ త్తున వెళ్లిన పోలీసులు సార్లపల్లి గ్రామానికి చెందిన మరి కొంత మంది చెంచులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇరువర్గా లకు చెందిన వారిని అచ్చంపేట డీఎస్పీ కార్యాలయానికి తీసుకువెళ్లి విచారించారు. ఈ ప్రాంతంలోని వివిధ సంఘాలకు చెందిన బాధ్యు లు కొంతమంది అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు వద్దకు వెళ్లి కేసు లు నమోదు చేయకుండా ఇరు వర్గాలకు చెందిన వారితో మాట్లాడి సామరస్యత నెలకొనే విధంగా ప్రయత్నించినట్లు తెలిసింది. మూడు రోజుల తర్వాత రెండు వర్గాలకు చెందిన వారు మాట్లాడుకుని రావా లని పోలీసులు చెప్పి పంపినట్లు సమాచారం. ఈ విషయంపై అ మ్రాబాద్ సీఐ శంకర్ నాయక్‌ను వివారణ కోరగా ఇరు వర్గాల వా రు గొడవపడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, ఈ సంఘటనకు సంబంధించి దర్యాప్తు జరుగుతున్నదని వెల్లడించారు.