చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం
ABN , Publish Date - Apr 24 , 2025 | 11:26 PM
చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
రాజోలి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని రాజోలి మండల కేంద్రంలోని చిన్నబజారులో గురువారం రాజోలి తహసీల్దార్ రాంమోహన్ ప్రారంభించారు. నీటితో పాటు మజ్జిగ కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన చిరంజీవి ఫ్యాన్స్‌ను అభినందించారు. కార్యక్రమంలో శివరామయ్య, వీరేశ్, ఫారుక్, చిన్నప్ప, రవి, ప్రతాప్ రామన్న, దినేశ్ పాల్గొన్నారు.