Share News

చిన్నారులకు టీకాలు తప్పకుండా వేయించాలి

ABN , Publish Date - Dec 10 , 2025 | 11:22 PM

చిన్నారులకు సకాలంలో టీకాలు వేయించేలా చూసే బాధ్యత వైద్యసిబ్బందిపై ఎంతైనా ఉన్నదని జోగుళాంబ గద్వాల జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్‌ సంధ్యాకిరణ్మయి అన్నారు.

చిన్నారులకు టీకాలు తప్పకుండా వేయించాలి
రికార్డులను పరిశీలిస్తున్న జోగుళాంబ గద్వాల డీఎంహెచ్‌వో డాకర్‌ సంధ్యాకిరణ్మయి

  • ఎంసీహెచ్‌ సెంటర్‌ను తనిఖీ చేసిన జోగుళాంబ గద్వాల డీఎంహెచ్‌వో

గద్వాల న్యూటౌన్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): చిన్నారులకు సకాలంలో టీకాలు వేయించేలా చూసే బాధ్యత వైద్యసిబ్బందిపై ఎంతైనా ఉన్నదని జోగుళాంబ గద్వాల జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్‌ సంధ్యాకిరణ్మయి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్‌ సెంటర్‌లోని వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా డీఎంహెచ్‌వో బుధవారం వ్యాక్సిన్‌ వేసుకునే వారి డ్యూలిస్ట్‌లను ఆశా కార్యకర్తల వారీగా పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వ్యాధి నిరోధక టీకా వేయగానే పిల్లల తల్లిదండ్రులకు నాలుగు మెసేజ్‌లు తెలుపాలన్నారు. జ్వరం రాకుండా సిరప్‌ మం దు ఇవ్వాలని సూచించారు. అలాగే మందుల స్టాక్‌ రిజిస్టర్‌ను మెయింటేన్‌ చేయాలన్నారు. ప్రతీ ఒక్క సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు చేయించాలని సూచించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో డీపీహెచ్‌ఎన్‌వో వరలక్ష్మి, హెల్త్‌ సూపర్‌వైజర్‌ సుబ్బలక్ష్మి, ఏఎన్‌ఎం లు గ్రేస్‌, లక్ష్మి, వివిధ వార్డుల ఆశా కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - Dec 10 , 2025 | 11:22 PM