పిల్లలకు పౌష్టికాహారం అందించాలి
ABN , Publish Date - Oct 10 , 2025 | 10:59 PM
పిల్లలకు పౌష్టికాహారం అందిం చాలని కలెక్టర్ విజయేందిరబోయి అన్నారు.
- కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): పిల్లలకు పౌష్టికాహారం అందిం చాలని కలెక్టర్ విజయేందిరబోయి అన్నారు. శు క్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పోషణ మాసంపై నిర్వహించిన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్, వివిధ రకాల స్టా ళ్లను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం మాట్లా డుతూ అంగన్‌వాడీలు, పాఠశాలల్లో న్యూట్రీ గార్డెన్‌లు ఏర్పాటు చేసుకోవాలని, ఇంటి వద్ద స్థ లముంటే అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చని కలెక్ట ర్ సూచించారు. అనంతరం పోషణ మాసంపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్డీఓ నరసింహులు, హార్టికల్చర్ డీడీ వేణుగోపాల్, డీఎంహెచ్‌వో పద్మజ, డీపీఓ పార్థసారథి, మహిళా ఽశిశు సంక్షేమ అధికారి జరీ నాబేగం, డీఈఓ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
సమాచారం హక్కు చట్టంపై అవగాహన ఉండాలి
ప్రభుత్వ అధికారుల పనితీరులో పారదర్శక త, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన సమాచారం హక్కు చట్టంపై అ ధికారులకు సంపూర్ణ అవగాహన ఉండాలని కలెక్టర్ అన్నారు. అక్టోబరు 5 నుండి 12వ తేదీ వరకు నిర్వహిస్తున్న సమాచార హక్కు చట్టం వారోత్సవాలలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌ఓ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా స్థాయి అన్ని శాఖల అ ధికారులకు, పౌర సమాచార అధికారులకు, స హాయ సమాచారం అధికారులకు కలెక్టర్ అధ్యక్ష తన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ చట్టం ద్వారా పౌరుల కు సాధికారత కలిగిందని.. అధికారులు ఎలా పని చేస్తున్నారో తెలుసుకునే హక్కు పౌరులకు లభిస్తుందన్నారు. ఆర్‌టీఐకి సంబంధించి దరఖా స్తులన్నీ నిర్ణీత వ్యవధిలో సమాచారం అందిం చాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
సమాచార హక్కు చట్టంతోనే
పారదర్శకమైన పాలన
మూసాపేట: సమాచార హక్కు చట్టంతోనే ప్రజలకు పారదర్శకమైన పాలన అందించడానికి దోహదపడుతుందని అడ్డాకుల తహసీల్దార్ శేఖ ర్ అన్నారు. అడ్డాకుల తహాశీల్దార్ కార్యాల యంలో శుక్రవారం సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అవగా హన సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా హజరై వివరించారు. సమావేఽశంలో నయాబ్ తహసీల్దా ర్ ఖలీద్ బీన్ ఎక్బాల్, గోపాలకృష్ణ, సృజన్‌కుమా ర్, శశికుమార్, నాయకులు పాల్గొన్నారు.