Share News

నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి

ABN , Publish Date - Apr 09 , 2025 | 11:03 PM

నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, రానున్న నాలుగేళ్లలో కొడంగల్‌ రూపు రేఖలు మారనున్నాయని నారాయణపేట జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ వార్ల విజయ్‌కుమార్‌ అన్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి
గొల్ల ఎల్లప్ప నివాసంలో నాయకులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తున్న వార్ల విజయ్‌కుమార్‌

- రానున్న నాలుగేళ్లలో కొడంగల్‌ రూపురేఖలు మారడం ఖాయం

- నారాయణపేట జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ వార్ల విజయ్‌కుమార్‌

కోస్గి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, రానున్న నాలుగేళ్లలో కొడంగల్‌ రూపు రేఖలు మారనున్నాయని నారాయణపేట జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ వార్ల విజయ్‌కుమార్‌ అన్నారు. బుధవారం మండలంలోని చెన్నారం గ్రామంలో చెన్నారం-కడంపల్లి, చెన్నారం-ముక్తిపాడ్‌ రోడ్డు నిర్మాణాలకు ఆయన భూమిపూజ చేశారు. రహదారుల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నారని, ఆరు నెలల్లో ఈ రోడ్డు పనులు పూర్తవుతాయన్నారు. అనంతరం గ్రామానికి చెందిన గొల్ల ఎల్లప్ప నివాసంలో రేషన్‌ దుకాణం ద్వారా పంపిణీ అయిన సన్న బియ్యంతో చేసిన భోజనాన్ని నాయకులతో కలిసి తిన్నారు. ప్రభుత్వం అందించే సన్నబియ్యం బాగానే ఉన్నాయని ఆ కుటుంబ సభ్యులు సంతో షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పా ర్టీ మండల అధ్యక్షుడు రఘువర్దన్‌రెడ్డి, మునిసిపల్‌ అధ్యక్షుడు బెజ్జు రాములు, పీఏసీఎస్‌ చైర్మన్‌ భీంరెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గిరి ప్రసాద్‌రెడ్డి, వేణుగోపాలస్వామి ఆలయ చైర్మన్‌ కృష్ణమూర్తి, నాయకులు అన్నకిష్టప్ప మైపాల్‌రెడ్డి, తుడుం శ్రీనివాస్‌, మల్లేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 11:03 PM