Share News

ఉచిత టాయిలెట్ల వద్ద డబ్బులు వసూలు

ABN , Publish Date - Aug 07 , 2025 | 11:25 PM

అలం పూర్‌లోని ఐదవశక్తి పీఠం జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామివారి ఆలయ ఆవరణలో ఉన్న ఉచిత మూత్రశాలలు, మరుగుదొడ్లు ప్ర స్తుతం వినియోగంలోకి వచ్చాయి.

ఉచిత టాయిలెట్ల వద్ద డబ్బులు వసూలు

- జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో గత టెండర్‌దారుల నిర్వాకం

అలంపూర్‌ ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): అలం పూర్‌లోని ఐదవశక్తి పీఠం జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామివారి ఆలయ ఆవరణలో ఉన్న ఉచిత మూత్రశాలలు, మరుగుదొడ్లు ప్ర స్తుతం వినియోగంలోకి వచ్చాయి. గతంలో ఉ న్న వాటిని ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ వారు తొలగించి, అక్కడే కొత్తవి నిర్మించారు. దేవస్థా నం వారికి అప్పగించారు. గతంలో వేలంపాట లో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్వహణను దక్కించుకున్న వారు, ప్రస్తుతం కొత్త మరుగు దొడ్ల వద్ద వినియోగదారుల నుంచి రూ.10 - రూ.15 వరకు బోర్డుపెట్టి మరీ వసూలు చేస్తు న్నారు. ఈ విషయాన్ని చూసి కొందరు భక్తులు ఆలయాలకు వచ్చిన భక్తులతో ఇలా అధిక డ బ్బులు వసూలు చేయడం తగదని అంటున్నా రు. ఈ విషయమై ఆలయ ఈవో పురేందర్‌కు మార్‌ను సంప్రదించగా మూత్రశాలల విష యం తమదృష్టికి రాలేదని, వెంటనే పరిశీలించి తగుచర్యలు తీసుకుంటానని తెలిపారు.

Updated Date - Aug 07 , 2025 | 11:25 PM