విద్యా వ్యవస్థలో మార్పులు
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:06 PM
పుస్తకాలతోనే జ్ఞానం వస్తుందని, సామాజిక మాధ్యమాలతో ఉపయోగం లేదని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. విద్యా వ్యవస్థలో 2025-26 సంవత్సరంలో స మూలమైన మార్పులు చేస్తున్నామన్నారు.

తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి
జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్
జడ్చర్ల, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి) : పుస్తకాలతోనే జ్ఞానం వస్తుందని, సామాజిక మాధ్యమాలతో ఉపయోగం లేదని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. విద్యా వ్యవస్థలో 2025-26 సంవత్సరంలో స మూలమైన మార్పులు చేస్తున్నామన్నారు. జ డ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం వాణిజ్యశాస్త్రం ఆధ్వర్యంలో కృత్రిమ మేధస్సు పాత్ర, సమస్యలు-అవకాశాలు అనే అంశంపై ని ర్వహించిన జాతీయ సెమినార్‌ను ఆయన ప్రా రంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ భవిష్యత్‌కు యువత కీలకమన్నారు. 18వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవంతో ప్రపంచం అభివృద్ధి చెందగా, 21వ శతాబ్దంలో వచ్చిన సాంకేతిక విప్లవంతో ప్రపంచంలోనే భారతదేశం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. 2030 నాటికి భారతదేశం 20 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందన్నారు. ఆరోగ్యం, విద్య, సాంకేతిక విధానాలకు ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తే అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవిస్తుందన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత కాలానికి అనుగుణంగా విద్యార్థులకు సిలబ్‌సలో మార్పులు తెస్తామన్నారు. ఆన్‌లైన్‌లో 55, ఆఫ్‌లైన్‌లో 32 పత్రసమర్పణలు చేశారన్నారు. వీరిలో 30 మంది విద్యార్థులు ఉన్నారని వివరించారు. యలమంచిలి రామకృష్ణ, రాజ్‌కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ నాగలక్ష్మి, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాసులు, కో కన్వీనర్ సులేమాన్, సభ్యులు శంకర్, వెంకట్‌రెడ్డి, అధ్యాపకులు నరసింహరావు, రాఘవేందర్‌రెడ్డి, సతీ్‌షరెడ్డి, సదాశివయ్య, వేణు, రుక్యాభాను, రాజేశ్వరీ, పుష్పలత, ప్రవీణ్‌కుమార్, మాధురి, వెంకటయ్య, నాగరాజు, ప్రతాప్, నందకిశోర్, వెంకటేశ్వర్లు, విక్రమ్, రజనీ, లత పాల్గొన్నారు.