Share News

ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లకు సర్టిఫికెట్ల ప్రదానం

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:47 PM

ఎన్‌ ఎస్‌ఎస్‌ విద్యార్థులు చేసిన మంచి పనులకు స మాజం ఎల్లప్పుడు తోడుగా ఉంటుందని వన పర్తి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఈశ్వరయ్య అ న్నారు.

ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లకు సర్టిఫికెట్ల ప్రదానం
గోపాల్‌పేటలో సర్టిఫికెట్లు అందుకున్న ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు

గోపాల్‌పేట, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఎన్‌ ఎస్‌ఎస్‌ విద్యార్థులు చేసిన మంచి పనులకు స మాజం ఎల్లప్పుడు తోడుగా ఉంటుందని వన పర్తి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఈశ్వరయ్య అ న్నారు. గురువారం మండల కేం ద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఎన్‌ ఎస్‌ఎస్‌ విద్యా ర్థుల ముగింపు సమావేశంలో ఆ యన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వలంటీర్లకు సర్టిఫికెట్స్‌ అందజేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్స్‌ పోతురాజు, శ్రీనివాస్‌, యువరూప లక్ష్మి, వైస్‌ ప్రిన్సిపాల్‌ రామరాజు యాదవ్‌, దామోదర్‌ రెడ్డి, సుష్మ, పుష్ప తదిత రులు పాల్గొన్నారు.

వనపర్తి రూరల్‌: మండలంలోని చందాపూ ర్‌లో గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ ఎస్‌ఎస్‌ యూనిట్‌ 3, 4 ఆధ్వర్యంలో రైతు వేది క వద్ద ఉన్న నర్సరీలో చెత్తను తీసివేశారు. న ర్సరీలోని వివిధ రకాల మొక్కల గురించి గ్రామ స్థులకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. రైతువేదిక పరిసర ప్రాంతాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మొక్కలకు పాదులు తీశారు. ఎన్‌ ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి దాంసింగ్‌, వెంక టస్వామి, రాజేష్‌, వలంటీర్లు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 11:47 PM