జోగుళాంబను దర్శించుకున్న ప్రముఖులు
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:22 PM
జోగుళాంబదేవి అమ్మవారిని దేవీశరన్నవరాత్రులలో భాగంగా శుక్రవారం పలువురు దర్శించుకున్నారు.
అలంపూర్, సెప్టెంబరు 26 (ఆంధ్ర జ్యోతి): జోగుళాంబదేవి అమ్మవారిని దేవీశరన్నవరాత్రులలో భాగంగా శుక్రవారం పలువురు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత, సినీ నిర్మాత బండ్ల గణేష్‌లు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు వారికి ఆలయ ఈఓ దీప్తి, ధర్మకర్తలు అడ్డాకుల రాము, నాగశిరమణి, పురందర్, చంద్రశేఖర్ రెడ్డి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామి వారి ఆలయంలో గణపతిపూజ, అభిషేకం, చండీ హోమం, అమ్మవారి ఆలయలో కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. వీరి వెంట డీఎస్పీ మొగులయ్య, సీఐ రవిబాబు, ఎస్సైలు వెంకటస్వామి, నిమ్మల కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.