Share News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై సంబురాలు

ABN , Publish Date - Jul 13 , 2025 | 11:07 PM

స్థానిక సంస్థలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ కోటా కేటాయిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకురావడంపై కాంగ్రెస్‌ సంబురాలు చేసు కుంటుంది.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై సంబురాలు
సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

మహబూబ్‌నగర్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ కోటా కేటాయిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకురావడంపై కాంగ్రెస్‌ సంబురాలు చేసు కుంటుంది. డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కేబినెట్‌ 42 శాతం రిజర్వేషన్లను ఆమోదిం చడంపై ఆదివారం నగరంలోని అంబేడ్కర్‌ చౌ రస్తాలో కాంగ్రెస్‌ ఓబీసీ సెల్‌ పట్టణ అధ్యక్షుడు బండి మల్లేష్‌ ఆధ్వర్యంలో సంబురాలు చేసు కున్నారు. రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు జీఎంఆర్‌, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షు రాలు వసంత, నాయకులు అజ్మత్‌అలీ, సాయి బాబ, రాఘవేందర్‌రాజు, సీజె బెనహర్‌, అవేజ్‌, రాములుయాదవ్‌, చంద్రశేఖర్‌, నాగరాజు, వెంకటలక్ష్మి, విజయలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2025 | 11:07 PM