Share News

కాంగ్రెస్‌ ప్రతిష్ట పెరిగేలా కులగణన

ABN , Publish Date - May 05 , 2025 | 11:13 PM

కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ట పెరిగేలా కులగణనను పారదర్శకంగా నిర్వహించామని ఆ పార్టీ జిల్లా అధ్య క్షుడు ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ ప్రతిష్ట పెరిగేలా కులగణన
పేట 20వ వార్డులో జైబాపు జైబీమ్‌ జైసంవిధాన్‌ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు

- కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి

నారాయణపేట, మే 5 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ట పెరిగేలా కులగణనను పారదర్శకంగా నిర్వహించామని ఆ పార్టీ జిల్లా అధ్య క్షుడు ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం నారాయణపేట 20, 21వ వార్డుల్లో జైబాపు జైబీమ్‌ జైసంవిదాన్‌ కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశాన్ని ఉద్ధేశించి ఆయన మాట్లాడారు. నేడు దేశవ్యాప్తంగా కులగణనను చేపట్టే విధంగా చేసిన ఘనత కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించి, అర్హులకు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ.సలీం, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్లు బండి వేణుగో పాల్‌, సరాఫ్‌ నాగరాజు, సుధాకర్‌, రమేష్‌, అస్నోద్దీన్‌ తదితరులున్నారు.

Updated Date - May 05 , 2025 | 11:13 PM