కులగణన వేతనాలు వెంటనే చెల్లించాలి
ABN , Publish Date - Oct 06 , 2025 | 11:23 PM
గత సంవత్సరంలో సమగ్ర కుటుంబసర్వే నిర్వ హిం చిన ఎన్యూమరేటర్లకు, డేటా ఎంట్రీ ఆపరేట ర్లకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని గద్వాల జిల్లా టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షుడు డి.రమేశ్ డిమాండ్ చేశారు.
టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేశ్
అలంపూర్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): గత సంవత్సరంలో సమగ్ర కుటుంబసర్వే నిర్వ హిం చిన ఎన్యూమరేటర్లకు, డేటా ఎంట్రీ ఆపరేట ర్లకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని గద్వాల జిల్లా టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షుడు డి.రమేశ్ డిమాండ్ చేశారు. అలం పూర్‌లోని ఐకేపీ భవనంలో సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల ట్రైనింగ్‌లో భాగంగా మండల ఎంపీడీవో పద్మావతికి సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమం లో మండల అధ్యక్షుడు రాముడు, ప్రధాన కార్యదర్శి జి.బయన్న, కోశా ధికారి కే.రాజకుమా ర్, పీఆర్‌టీయూ నాయకులు వెంకట్ నాయుడు, వీరేశప్ప పాల్గొన్నారు.