రాహుల్ చొరవతోనే కులగణన
ABN , Publish Date - Jun 19 , 2025 | 10:47 PM
రాహుల్‌గాంధీ చొరవతోనే కులగణన ప్రక్రియ ప్రారంభమైందని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనవాస్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యేలు జీ.మధుసూదన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
- ఘనంగా రాహుల్‌గాంధీ జన్మదినవేడుకలు
మహబూబ్‌నగర్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి) : రాహుల్‌గాంధీ చొరవతోనే కులగణన ప్రక్రియ ప్రారంభమైందని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనవాస్‌రెడ్డి అన్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో అన్ని వర్గాలను ఏకం చేయాలని, కులగణన చేయాలని సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారన్నారు. గురువారం రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టసభలలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని, సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపించారని, కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, నాయకులు ఏపీ మిథున్‌రెడ్డి, సంజీవ్‌ముదిరాజ్, లక్ష్మణ్‌యాదవ్, ఆనంద్‌కుమార్‌గౌడ్, వినోద్‌కుమార్, సురేందర్‌రెడ్డి, ఎన్‌పీ వెంకటేశ్, సిరాజ్‌ఖాద్రి, బెక్కరి అనిత, వసంత, జహీర్‌అక్తర్, సీజె బెనహర్ పాల్గొన్నారు.