Share News

బాల్యవివాహానికి హాజరైనా కేసు నమోదు

ABN , Publish Date - Oct 13 , 2025 | 11:35 PM

జిల్లాలో బాల్యవివాహాలను అరికట్టాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధికారులను ఆదేశించారు.

బాల్యవివాహానికి హాజరైనా కేసు నమోదు
చిన్నారికి అక్షరాభ్యాసం చేయిస్తున్న కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

- వనపర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బాల్యవివాహాలను అరికట్టాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లా డారు. బాల్య వివాహాలు జరుగకుండా తల్లిందండ్రులతో పాటు వివాహంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. సెప్టెంబరు 17 నుంచి ప్రారంభమైన పోషణ మాసం కార్యక్రమం సందర్భంగా ఇచ్చిన లక్ష్యాలు, చేపట్టిన కార్యక్రమాలపై జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి వివరాలు వెల్లడించారు. బాల్య వివాహాలకు సంబంధించిన ముందస్తు సమాచారం ఇచ్చేందుకు 1098, 100, 112 నంబర్లకు ఫోన్‌ చేయాలని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని కలెక్టర్‌ అన్నారు. అనంతరం ఆర్‌డీఎస్‌ స్వచ్ఛంద సంస్థ చిన్నమ్మ థామస్‌ రూపొందిం చిన ఇచ్చట బాల్య వివాహలు నిర్వహించబడవు.. అనే గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం చిన్నారులకు అన్న ప్రాశన, అక్షరాభ్యా సం, గర్భిణులకు సీమంతం కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్‌, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, పీడీఆర్‌ఓ ఉమాదేవి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2025 | 11:35 PM