Share News

అజాగ్రత్తతోనే ప్రమాదం

ABN , Publish Date - Mar 13 , 2025 | 11:29 PM

ఏళ్లు గా నిలిచిపోయిన ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనుల ను ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండానే ప్రభు త్వం తవ్వకాలు చేయడంతోనే ప్రమాదం జరి గిందని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌ విమర్శించారు.

అజాగ్రత్తతోనే ప్రమాదం
దోమలపెంటలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద పౌర హక్కుల సంఘం నాయకులు

- ఎస్‌ఎల్‌బీసీ బాధిత కుటుంబాలకు రూ.2కోట్ల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

- పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌

మన్ననూర్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : ఏళ్లు గా నిలిచిపోయిన ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనుల ను ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండానే ప్రభు త్వం తవ్వకాలు చేయడంతోనే ప్రమాదం జరి గిందని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌ విమర్శించారు. ఫిబ్రవరి 22న ఎస్‌ ఎల్‌బీసీ సొరంగం పనులు జరుగుతుండగా టీబీఎం యంత్రంపై ఆకస్మికంగా కొండ చరియ లు కూలిన ఘటనలో ఎనిమిది మంది కార్మికు లు చిక్కుకోగా, వారిలో పంజాబ్‌కు చెందిన గురు ప్రీత్‌ సింగ్‌ మృతదేహం లభించింది. ఈ ప్రమా ద ఘటనపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర, జిల్లా పౌరహక్కుల సంఘం నేతలు నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంటలోని ఎస్‌ఎల్‌ బీసీ సొరంగాన్ని గురువారం సందర్శించారు. మొదట కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌తో మాట్లాడి ప్రస్తుత సహాయక చర్యలను అడిగి తెలుసుకొని, ఎస్‌ఎల్‌ బీసీ ముఖద్వారం వద్దకు అనుమతి తీ సుకొని వెళ్లారు. అక్కడ ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ ఎఫ్‌, హైడ్రా, అన్వి రోబో సహాయక బృందాలతో మాట్లాడి టన్నెల్‌లో తప్పిపోయిన వారిని వెలికి తీసేందుకు చేపడుతున్న చర్యలను అడిగి తెలు సుకున్నారు. అనంతరం మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సొరంగం పనులు ఏ కారణంతో నిలిపివేశారో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధ్యయనం చేయలేదన్నా రు. మృతుడు గురుప్రీత్‌సింగ్‌ కుటుంబానికి ప్ర భుత్వం రూ. 25 లక్షలు ఇస్తే సరిపోదని, బా ధిత కుటుంబాలకు రూ. 2కోట్ల ఎన్స్‌గ్రేషియా ఇవ్వాలని, కంపెనీ మరో రూ.కోటి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 13 , 2025 | 11:29 PM