పెబ్బేరులో గంజాయి కలకలం
ABN , Publish Date - Oct 06 , 2025 | 11:15 PM
వనపర్తి జిల్లా పెబ్బేరు మునిసిపాలిటీలోని ఆర్టీసీ బ స్టాండ్ ఆవరణలో సోమవారం సాయంత్రం గంజాయిని పోలీసులు స్వాధీనం చేస్తున్నారు.
- హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలిస్తున్న 4 కిలోల గంజాయి స్వాధీనం
- కర్ణాటకకు చెందిన మల్లేశ్ ప్రభును అదుపులోకి తీసుకున్న పోలీసులు
పెబ్బేరు, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): వనపర్తి జిల్లా పెబ్బేరు మునిసిపాలిటీలోని ఆర్టీసీ బ స్టాండ్ ఆవరణలో సోమవారం సాయంత్రం గంజాయిని పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. ఎస్‌ఐ గంగిరెడ్డి యుగేంధర్‌రెడ్డి తెలిపిన వివ రాల ప్రకారం. కర్ణాటక రాష్ర్టానికి చెందిన మల్లేశ్ ప్రభు అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు గంజాయిని తరలిస్తున్నాడనే స మాచారంతో పెబ్బేరు ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీ సులు రెక్కీ నిర్వహించారు. ఆ వ్యక్తిని అదుపు లోకి తీసుకొని అతని దగ్గర ఉన్న బ్యాగును పరిశీలించగా 4 కేజీల గంజాయి లభ్యమైంది. మల్లేశ్ ప్రభు అతని స్నేహితుడు దిలీప్‌కాళీ ఇద్దరూ కలిసి మోహన్, అర్జున్ అనే వ్యక్తుల దగ్గర ఒడిషాలో గంజాయిని కొనుగోలు చేసి బెంగళూరులో విక్రయించేవారు. గంజాయిని తీ సుకొని ఇద్దరూ వస్తున్న క్రమంలో దిలీప్ కాళీ తనకు పని ఉందని మధ్యలోనే బస్సు దిగి వెళ్లాడు. గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.