పొలంలో గంజాయి మొక్కలు స్వాధీనం
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:15 PM
గంజాయి సాగు చేస్తున్న నిందితుడిని అరెస్టుచేయడంతో పాటు అత డి నుంచి 9 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు గద్వాల సీఐ టి. శ్రీను తెలిపారు.
- నిందితుడి అరెస్టు
గద్వాల క్రైం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): గంజాయి సాగు చేస్తున్న నిందితుడిని అరెస్టుచేయడంతో పాటు అత డి నుంచి 9 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు గద్వాల సీఐ టి. శ్రీను తెలిపారు. గురువారం పట్టణంలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అయిజ మండలం తొత్తినోనిదొడ్డి గ్రామానికి చెందిన బస్వాపురం ప్రాణేష్ అనే వ్యక్తి బుధవారం గట్టు మండలం బోయలగూడెం శివారులో పొలం కౌలుకు తీసుకున్నాడు. అందులో మిరప, పత్తి పంటల మధ్యలో ఎవరికీ అనుమానం రాకుండా, అక్రమంగా తన స్వలాభం కోసం గంజాయి సాగు చేస్తున్నాడన్నారు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు గట్టు ఎస్‌ఐ. కె.టి.మల్లేష్ సిబ్బందితో పాటు అగ్రికల్చర్, రెవెన్యూ అధికారులతో పాటు పంచాయతీ సెక్రటరీని కలిసి బోయలగూడెం సర్వే నెం. 382/లలో అక్రమంగా సాగుచేస్తున్న 9 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నేరస్తుడిని గురువారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరపర్చగా రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు.