గంజాయి ముఠా గుట్టురట్టు
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:08 PM
గంజాయి విక్రయించే ముఠా గుట్టురట్టయింది. నాగర్‌కర్నూల్ జిల్లా జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని, కొనుగోలు చేస్తున్న మరో నలుగురికి అరెస్టు చేసినట్లు డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
- 8 మంది అరెస్టు, 7 ఫోన్లు స్వాధీనం
- 735 గ్రాముల గంజాయి పట్టివేత
- వివరాలు వెల్లడించిన డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్
నాగర్‌కర్నూల్ క్రైం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : గంజాయి విక్రయించే ముఠా గుట్టురట్టయింది. నాగర్‌కర్నూల్ జిల్లా జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని, కొనుగోలు చేస్తున్న మరో నలుగురికి అరెస్టు చేసినట్లు డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలో హౌసింగ్‌బోర్డు కాలనీలోని చైతన్య లాడ్జీలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం తెలియడంతో వారిపై స్థానిక ఎస్‌ఐ గోవర్ధన్ ఆధ్వర్యంలో పోలీస్ బృందం దాడి చేసి పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. గంజా విక్రయిస్తున్న ముఠా నాగర్‌కర్నూల్ పట్టణం లోని ఈదమ్మగుడి ప్రాంతానికి చెందిన బొందల రేణుకుమార్, ఈశ్వర్ కాలనీకి చెందిన మైలగాని సందీప్, అరకు విశ్వాస్, అచ్చంపేట మం డలం హాజీపూర్‌కు చెందిన ఎడ్ల వంశీలను పట్టుకున్నట్లు తెలిపారు. వీరంతా నాగర్‌కర్నూల్ పట్టణంలో ఒక లాడ్జీలో రూము అద్దెకు తీసు కున్నారు. హైదరాబాద్‌లోని దూల్‌పేటకు చెందిన ఆకాశ్‌సింగ్ దగ్గర గంజాయి కొనుగోలు చేసి ఇక్కడ విక్రయిస్తున్నారు. నాగర్‌కర్నూల్ పట్టణంలోని దళిత వాడకు చెందిన కొత్త వెంకటేశ్, కొత్త మనోజ్ కుమార్, తాడూరు మండల పరిధిలో గల గుంతకోడూరుకు చెందిన ఉడతల ఆదికృష్ణగౌడ్, గొల్ల పరమేశ్‌లు లాడ్జీలో గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చి పోలీసులకు పట్టుబడినట్లు డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి 735 గ్రాముల గంజాయితో పాటు ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనపర్చుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగర్‌క ర్నూల్ సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ గోవర్ధన్, స్థానిక పోలీసులు భీముడు, ప్రవీణ్, హోంగార్డు రమేష్ వీరితో పాటు మరికొంత మంది పోలీస్ సిబ్బంది ఉన్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. పట్టుబడిన గంజాయి విలువ 25 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. వీరిపై నార్కోటిక్ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.