ఉగ్ర దాడిని నిరసిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:14 PM
పెహల్గాంలో ఉగ్రదాడిని నిరసిస్తూ నారాయణపేటలో శనివారం రాత్రి వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
నారాయణపేట, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): పెహల్గాంలో ఉగ్రదాడిని నిరసిస్తూ నారాయణపేటలో శనివారం రాత్రి వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక శ్రీశివలింగేశ్వర దేవస్థానం నుంచి చౌక్‌బజార్ మీదుగా వీరసావర్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు గందె రవికాంత్ మాట్లాడుతూ పాకిస్థాన్ దుశ్చర్యను ఖండించారు. అమాయాక ప్రజలపై హింసాకాండకు దిగడం అమానుషమన్నారు. భారత్ దీన్ని గట్టిగా తిప్పికొడుతుందన్నారు. అనంతరం అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సమాజం సభ్యులు గందె రవికాంత్, గందె చంద్రకాంత్, కన్న జగదీష్, ల్యాబ్ శివకుమార్, లిక్కి రఘు, అవుటి రవికుమార్, హరకంచి రవి, మల్లికార్జున్, నాగభూషణం, గందే సుమిత్, రాజేష్, అక్కమహదేవి మహిళా సంఘం సభ్యులు ఉన్నారు.