Share News

కార్యకర్తల ఏకాభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపిక

ABN , Publish Date - Nov 27 , 2025 | 11:41 PM

స్థానిక ఎన్నికల్లో నిత్యం ప్రజల మధ్యలో ఉం టూ వారి సమస్యల పట్ల పోరాటం చేస్తున్న నాయకులను అభ్యర్థులుగా ఎంపిక చేయాలన్న కార్యకర్తల అభిప్రాయం మేరకు అభ్యర్థుల ఎం పిక ఉంటుందని బీఆర్‌ఎస్‌ గద్వాల నియోజక వర్గ ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడు అన్నారు.

కార్యకర్తల ఏకాభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపిక

  • బీఆర్‌ఎస్‌ పార్టీ గద్వాల ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడు

ధరూరు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : స్థానిక ఎన్నికల్లో నిత్యం ప్రజల మధ్యలో ఉం టూ వారి సమస్యల పట్ల పోరాటం చేస్తున్న నాయకులను అభ్యర్థులుగా ఎంపిక చేయాలన్న కార్యకర్తల అభిప్రాయం మేరకు అభ్యర్థుల ఎం పిక ఉంటుందని బీఆర్‌ఎస్‌ గద్వాల నియోజక వర్గ ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడు అన్నారు. సర్పంచు ఎన్నికల సందర్భంగా గురు వారం ధరూర్‌లో నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసంద ర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మ భ్యపెట్టి ఓట్లను దండుకునేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టాలన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో 42శాతం బీసీలకు రిజ ర్వేషన్లు కల్పిస్తామని ఆశలు కల్పించి నమ్మక ద్రోహం చేసిందన్నారు. మొత్తంగా బీసీలకు 17 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని, కొన్ని జిల్లాల్లో బీసీలకు మూడు నుంచి నాలుగు శాతం రిజర్వే షన్లు కూడా అమలు కాలేదన్నారు. ప్రజలకు కేసీఆర్‌ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరి స్తూ, కాంగ్రెస్‌ పాలనలో విఫలమైన విషయాల ను గ్రామ బ్రాహ్మణ ప్రజలకు స్పష్టంగా వివ రించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించా రు. సమావేశంలో వెంకటేశ్వర్‌ రెడ్డి, చక్రదర్‌ రా వు, రాజారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, వెంకటేశ్‌ నాయు డు, సుభాష్‌, రంగారెడ్డి, వెంకటేశ్‌ యాదవ్‌, గోవిందు, నరసింహులు, రాము, రంగన్న, వీరేశ్‌, రాముడు ఉన్నారు.

Updated Date - Nov 27 , 2025 | 11:41 PM