ఒంటె వాహన సేవ
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:10 PM
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం స్వామి వారికి ఒంటె వాహన సేవ నిర్వహించారు.
కొనసాగుతున్న పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
మక్తల్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం స్వామి వారికి ఒంటె వాహన సేవ నిర్వహించారు. ఉదయం సుప్రభాతం, పంచామృతాభిషేకం, ఆకు పూజలు, మధ్యాహ్నం మహానివేదన, సాయంత్రం వాహనసేవలు, మహా మంగళహారతి నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు ప్రాణేశాచారి, ఈఓ కవిత, ఆలయ అర్చకులు అరవింద్, డీవీచారి, సిబ్బంది కుమ్మరి శ్రీనివాసులు, రజినీకాంత్, భక్తులు పాల్గొన్నారు.