Share News

గద్వాలకు ఉప ఎన్నిక ఖాయం!

ABN , Publish Date - Apr 09 , 2025 | 11:32 PM

గద్వాల నియోజక వర్గానికి త్వరలోనే ఉప ఎన్నిక తప్పదని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

గద్వాలకు ఉప ఎన్నిక ఖాయం!
విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

- సుప్రీం తీర్పుతో 10 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు

- 27న జరిగే రజతోత్సవ సభకు పెద్దఎత్తున హాజరు కావాలి

గద్వాల న్యూటౌన్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): గద్వాల నియోజక వర్గానికి త్వరలోనే ఉప ఎన్నిక తప్పదని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం గద్వాల పట్టణంలోని పా ర్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు బాసు హనుమంతు నాయుడు అధ్యక్షతన జరిగిన స న్నాహక సమావేశానికి నిరంజన్‌రెడ్డి ముఖ్య అతిథి గా హాజరై మాట్లా డారు. 18 రోజులలో నాయకులు మండల, గ్రామ సమావేశాలు, పార్టీ పతాక ఆవిష్కరణ చేసి సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ నెల 27న వరంగల్‌లో జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు గ్రామగ్రామాన సమావేశాలు, సోషల్‌ మీడి యా వేదికగా ప్రచారం నిర్వహించి కార్యకర్తలను, ప్రజల ను సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గద్వాల బీఆర్‌ఎస్‌ నాయకులు జడ్పీటీసీ మాజీ సభ్యులు బాసు శ్యామల, మాజీ ఎంపీపీ మనోరమ్మ, గ్రంఽథాలయ మాజీ చైర్మన్‌ పటేల్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు డాక్టర్‌ కుర్వ విజయ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 11:32 PM