Share News

నాణ్యమైన విత్తనాలు కొనాలి

ABN , Publish Date - May 26 , 2025 | 11:22 PM

రైతులు నాణ్యమైన విత్తనాలు కొనాలని మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ అన్నారు.

నాణ్యమైన విత్తనాలు కొనాలి
కోస్గిలో ఫర్టిలైజర్‌ షాపును తనిఖీ చేస్తున్న వ్యవసాయ అధికారి రామకృష్ణ

కోస్గి రూరల్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): రైతులు నాణ్యమైన విత్తనాలు కొనాలని మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ అన్నారు. సోమవారం మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో విత్తనాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. రైతులు తమ నేల స్వభావానికి అనుగుణంగా, నీటి వసతి ఆధారంగా విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు. నకిలీ విత్తనాలు, అనుమానాస్పద అంశాలు కనిపించిన వెంటనే సమీప వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం మండలంలోని అన్ని ఫర్టిలైజర్‌ షాపులను తనిఖీ చేసి, నిల్వ ఉన్న స్టాక్‌లను పరిశీలించారు. ప్రతీ అంశాన్ని రిజిష్టర్లలో నమోదు చేయాలని యజమానులకు సూచించారు.

Updated Date - May 26 , 2025 | 11:22 PM