Share News

నిరుపయోగంగా బస్‌ షెల్టర్లు

ABN , Publish Date - Apr 29 , 2025 | 11:15 PM

జాతీయ రహదారి శాఖాపూర్‌ ఎల్‌అండ్‌టీ టోల్‌ప్లాజా పరిధిలో గల ఆయా గ్రామాల స్టేజీ వద్ద గతంలో ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు షెల్టర్లు నిర్మించారు.

నిరుపయోగంగా బస్‌ షెల్టర్లు
పోల్కంపల్లి స్టేజీ 44వ జాతీయ రహదారిపై వృథాగా ఉన్న బస్‌ షెల్టర్‌

- స్టేజీకి దూరంగా నిర్మించడంతో వినియోగంలోకి రాని వైనం

మూసాపేట, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి) : జాతీయ రహదారి శాఖాపూర్‌ ఎల్‌అండ్‌టీ టోల్‌ప్లాజా పరిధిలో గల ఆయా గ్రామాల స్టేజీ వద్ద గతంలో ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు షెల్టర్లు నిర్మించారు. కానీ బస్సు షెల్టర్ల వద్ద బస్సులు నిలపకుండా కొద్ది దూరంలో నిలపడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 44వ జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరణ చేసిన సమయంలో ప్రతీ గ్రామ స్టేజీ వద్ద స్టేజీకి కొద్ది దూరంలో నిర్మించారు. సుమారు 40 వరకు ఉన్న బస్సు షెల్టర్లలో చాలా వరకు వినియోగంలో లేకపోవడంతో వృథాగా మారాయి. ఈ క్రమంలో కొన్ని బస్సు షెల్టర్లు యాచకులు, మతి స్థితిమితం లేని వారికి స్థావరంగా మారగా, మరికొన్ని చోట్ల చెత్తాచెదారం పేరుకుపోయి అపరి శుభ్రంగా దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో పాత స్టేజీల వద్దనే బస్సులుఉ నిలపడంతో ప్రయాణికులు ఎండకు ఎండుతూ.. వర్షానికి నానుతూ బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా బస్టాండ్‌ దగ్గర ఏర్పాటు చేసిన నీటి ట్యాంకుల్లో కూడా నీటిని సరఫరా చేయలేకపోవడంతో వృథాగా మారాయి. ప్రస్తుతం వేముల స్టేజీ, జానంపేట, శేరిపల్లి(బి), వెల్టూర్‌ స్టేజీ వద్ద సర్వీస్‌ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో ప్రయాణికులు ఎండలోనే బస్సుల రాకపోకల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ విషయంలో సంబంధితశాఖ అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Apr 29 , 2025 | 11:15 PM