బస్సెనక బస్సు.. ఇబ్బందుల్లో ప్రయాణికులు
ABN , Publish Date - Oct 05 , 2025 | 11:30 PM
ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సమయానికి బస్సులు నడిపిస్తుంది.
హన్వాడ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సమయానికి బస్సులు నడిపిస్తుంది. కానీ అందుకు విరుద్ధంగా బస్సు డ్రైవర్లు మా త్రం ఇష్టం వచ్చినట్లు బస్సులు నడిపిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేసిన నాటి నుంచి ఆర్టీసీ, ప్రైవేట్ బ స్సులు ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు వెళ్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఆదివారం సా యంత్రం 4.45 గంటల సమయంలో ఒకేసారి బస్సెనక బస్సు 14 బస్సులు తాండూర్ నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్లాయి. అన్ని మహబూ బ్‌నగర్, తాండూర్ డిపోలకు చెందిన బస్సులే. ప్రధానంగా ప్రైవేట్ బస్సు డ్రైవర్లు వారికి ఇష్టం వచ్చిన స్టేజీ వద్ద అపుతున్నారు. స్టాప్ వద్ద ప్రయాణికులు ఉండి, బస్సు ఖాళీగా ఉన్నా.. వారికి ఇష్టం లేకపోతే బస్సులు ఆపడం లేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే డ్రైవర్లు, కండక్టర్లు ప్రయా ణికులపై దురుసుగా మాట్లాడుతున్నారు. ఆర్టీసీ యాజమాన్యం నిఘా పెట్టి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా సమయానికి బస్సులు నడిచే విధంగా చూడాలని కోరుతున్నారు.