మండుతున్న ఎండలు
ABN , Publish Date - Apr 23 , 2025 | 11:32 PM
రోజు రోజుకు ఎండల మండుతున్నాయి.
- అత్యధికంగా గద్వాల జిల్లా మల్దకల్‌లో
43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- అత్యల్పంగా వనపర్తి జిల్లా రేవల్లిలో 24.0 డిగ్రీలు
- బయటికి రావాలంటే జంకుతున్న ప్రజలు
- మూడు జిల్లాల్లో 42 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రత
- తీవ్ర ఇబ్బంది పడుతున్న చిరు వ్యాపారులు
నాగర్‌కర్నూల్ టౌన్/గద్వాల/వనపర్తి, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): రోజు రోజుకు ఎండల మండుతున్నాయి. వారం రోజులుగా సగటు ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా నమోదవుతూ వస్తోంది. నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో బుధవారం గరిష్ఠంగా 42 డిగ్రీలు దాటింది. కనిష్ఠ ఉష్ణోగ్రత 24 నుంచి 29 వరకు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఎండల ప్రభావం తీవ్రమవుతోం ది. మధ్యాహ్నం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఎండలకు భయపడి అత్యవసర సమయంలో తప్పా జనాలు బయటికి రావాలంటే జంకుతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండల ప్రభావంతో చిరు వ్యాపారులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో ఎండలు ఎలా ఉంటాయోనని ప్రజలు భయపడుతున్నారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో 43.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గద్వాల, ధరూర్‌లలో 42.5, అయిజలో 42.4, కేటీ దొడ్డిలో 42.3, గట్టులో 42.2, ఆలంపూర్‌లో 424, ఇటిక్యాలలో 41.9, రాజోలిలో 41.4, వడ్డేపల్లిలో 41.1, మానవపాడులో 40.5, ఉండవెల్లిలో 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 25 డిగ్రీలు నమోదైంది. వనపర్తి జిల్లా పెబ్బేరులో 42.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అమరచింత 42.5, ఆత్మకూరు 42.4, చిన్నంబావి 42.4, కొత్తకోట 42.3, పెద్దమందడి 42.2, పాన్‌గల్ 42.1, మదనాపూర్ 42.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రేవల్లి మండలంలో 24.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లాలో గరిష్ఠంగా 41 డిగ్రీలు, కనిష్ఠంగా 28 డిగ్రీలు నమోదైంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో గరిష్ఠంగా 39 డిగ్రీలు, కనిష్ఠంగా 27 డిగ్రీలు నమోదైంది. నారాయణపట జిల్లాలో గరిష్ఠ ఉష్ర్ణోగత 38 డిగ్రీ సెంటీగ్రేడ్‌లు, కనిష్ఠ ఉష్ణోగ్రత 28 డిగ్రీలు నమోదైంది.