ప్రతీ తండాకు బీటీ రోడ్డు
ABN , Publish Date - Apr 18 , 2025 | 11:03 PM
: ప్రతీ తండాకు బీటీ రోడ్డు వేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. శుక్రవారం హన్వాడ నుంచి దొర్రితండా వరకు ఎస్టీ ఎస్‌డీఎఫ్ నిధేలు రూ.2.24 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులను ఎమ్మెల్యే పూజ చేసి, ప్రారంభించారు.
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి
రూ.2.24 కోట్ల పనులకు శంకుస్థాపన
సన్నబియ్యం లబ్ధిదారు ఇంట్లో మధ్యాహ్న భోజనం
హన్వాడ, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): ప్రతీ తండాకు బీటీ రోడ్డు వేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. శుక్రవారం హన్వాడ నుంచి దొర్రితండా వరకు ఎస్టీ ఎస్‌డీఎఫ్ నిధేలు రూ.2.24 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులను ఎమ్మెల్యే పూజ చేసి, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ రహదారులకు మహర్దశ ప్రారంభమైందని చెప్పారు. ప్రతీ తండాకు రోడ్డు వేస్తామని అన్నారు. రోడ్డు ఏర్పాటైతే రవాణా సౌకర్యంతో పాటు విద్యార్థులకు విద్య కోసం ఉపయోగపడుతుందని తెలిపారు. వైద్యం కోసం వెళ్లే వారికి మేలు జరుగుతుందన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సన్న బియ్యం లబ్ధిదారు అంజిలమ్మ ఇంట్లో ఎమ్మెల్యే మధ్యాహ్న భోజనం చేశారు. అ ఇంట్లో భోజనం చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. పే దలందరూ సన్న బియ్యంతో భోజనం చేయాలనే తపనతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేషాన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ అనిత, పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్, నాయకులు కృష్ణయ్య, లింగంనాయక్, లక్ష్మణ్, దాసరి వెంకటయ్య, నవనీత, కలీం, వెంకటయ్య, ఎంపీడీవో యశోద, డీటీ వెంకటేశ్వర్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.