వెల్కిచర్లలో మహిళ దారుణ హత్య
ABN , Publish Date - May 03 , 2025 | 11:11 PM
ఇంట్లో పడుకొని ఉన్న మహిళను కత్తితో గుర్తు తెలి యని వ్యక్తులు మెడ, ఛాతిపై దారుణంగా పొడిచి హత్య చేశారు.
- సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ రామకృష్ణ
భూత్పూర్, మే 3 (ఆంధ్రజ్యోతి): ఇంట్లో పడుకొని ఉన్న మహిళను కత్తితో గుర్తు తెలి యని వ్యక్తులు మెడ, ఛాతిపై దారుణంగా పొడిచి హత్య చేశారు. ఈ సంఘటన మహ బూబ్‌నగర్ జిల్లా, భూత్పూర్ మండలంలో చోటు చేసుకుంది. సీఐ రామకృష్ణ కథనం ప్ర కారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలం లోని వెల్కిచర్ల గ్రామానికి చెందిన కొత్తగొల్ల నాగమ్మ(40) అనే మహిళను గత 20ఏళ్ల కిందట జడ్చర్ల మండలంలోని పెద్దపల్లి గ్రామానికి చెందిన చెన్నయ్యకు ఇచ్చి వివాహం చేశారు. ఏడాది పాటు సవ్యంగా సాగిన వీరి సంసార జీ వితం తరువాత మనస్పర్ధలు రావడంతో కొత్తగొల్ల నాగమ్మ తన సంవత్స రం వయస్సు ఉన్న కూతురును తీసుకొని తన తల్లిగారి గ్రామం అయిన వెల్కిచర్లకు వచ్చింది. భర్త, కూతరు ఇద్దరు అనారోగ్యంతో చనిపోయారు. నాగమ్మ వంటరి గానే గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుంది. అదే గ్రామంలో సొంత ఇంటిని కూడా నిర్మించుకుంది. రోజువారి మాదిరిగానే కొత్తగొల్ల నాగమ్మ కూలీ పనులు చేసుకొని శుక్రవారం సాయంత్రం ఇంటి వద్ద ఉ న్నది. రాత్రి ఏమి జరిగిందో తెలియదు. ఇంట్లో హత్యకు గురై రక్తపు మ డుగులో పడిఉంది. విషయాన్ని తోటి కూలీలు శనివారం ఉదయం కూలీ పనులకు నాగమ్మ ఇంటికి వెళ్లి చూడగా కత్తులతో శరీరంపై పొడిచి గుర్తు తెలియన వ్యక్తులు చంపివేసి వెళ్లిపోయారు. విషయాన్ని తెలుసుకున్న భూత్పూర్ సీఐ రామకృష్ణ హత్య జరిగిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో పొ డిచి హత్య చేశారని సీఐ గుర్తించారు. మృతదేహాన్ని పంచనామా నిర్వ హించి పోస్టుమార్టు నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తర లించారు. హంతకురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లుగా సీఐ రామకృష్ణ తెలిపారు.