Share News

బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం ఖాయం

ABN , Publish Date - May 09 , 2025 | 11:24 PM

బీఆర్‌ఎస్‌ పార్టీ తిరిగి అధి కారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.

బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం ఖాయం
హన్వాడ మండలానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులను కండువాలు కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానిస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పార్టీ తిరిగి అధి కారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. శుక్రవారం జిల్లా కేం ద్రంలోని పార్టీ కార్యాలయంలో హన్వాడకు చెం దిన కాంగ్రెస్‌ నాయకులకు బీఆర్‌ఎస్‌ కండు వాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద ర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమలుకు సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్ర భుత్వం మాట తప్పిందని విమర్శించారు. మా కు పరిపాలన తెలుసు.. అన్ని అమలు చేస్తా మని చెప్పి నేడు చేతులు ఎత్తేశారని ఎద్దేవ చే శారు. రైతులకు రుణమాఫీ, రైతుబంధు, బీమా ఊసే లేదన్నారు. రైతులకు మద్దతు ధర కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోయిందన్నారు. గ్రామా ల్లోకి వచ్చిన అధికార పార్టీ నాయకులను ఇచ్చి న హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీ యాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి మోసం పోయామని ప్రజలు నేడు పశ్చాతాపం చెందుతున్నారన్నారు. ప్రభు త్వాన్ని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు న మోదు చేస్తున్నారన్నారు. వారు పెట్టే తప్పుడు కేసులకు భయపడవద్దని వారికి మద్ధతుగా బీ ఆర్‌ఎస్‌ ఉంటుందన్నారు. హన్వాడ మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్‌, నరేందర్‌, చెన్నయ్య, కొండ లక్ష్మయ్య, శ్రీనివాసులు, అనం త రెడ్డి, అన్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2025 | 11:24 PM