Share News

వాగు ఎక్కని వంతెనలు

ABN , Publish Date - May 11 , 2025 | 11:15 PM

వానకాలం సమీపించే కొద్ది నది పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజల్లో ఆందోళన అధికమవుతుంది.

  వాగు ఎక్కని వంతెనలు
సిర్సవాడ నుంచి మాదారం వెళ్తున్న క్రమంలో వరద ఉధృతి ఎక్కువ రావడంతో నదిలోకి కొట్టుకుపోయిన ఆటో(ఫైల్‌)

- వానాకాలం సమీపిస్తున్న కొద్ది బాధిత గ్రామాల్లో ప్రజల ఆందోళన

-ఎన్నికల నినాదంగా మారిన మన్నెవారిపల్లి బ్రిడ్జి నిర్మాణం

- ఉల్పెర, మొల్గర వంతెన నిర్మాణాలది కూడా అదే పరిస్థితి

- బావాయిపల్లి వాగుపై కలగా మిగిలిన వారధి నిర్మాణం

- సిర్సవాడ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు ఎప్పుడో?

నాగర్‌కర్నూల్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): వానకాలం సమీపించే కొద్ది నది పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజల్లో ఆందోళన అధికమవుతుంది. దుందుభీతో పాటు స్థానిక వాగులు పొంగినప్పుడు రవాణా సౌకర్యానికి అవస్థలు తప్పడం లేదు. సుదీర్ఘకాలంగా వంతెన నిర్మాణంపై జరుగుతున్న జాప్యం పట్ల జనంలో తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది. వాగులు ఉప్పొంగినప్పుడు అందులో కొట్టుకుపోయిన వారి కుటుంబాలను పరామర్శించడం తప్ప శాశ్వతంగా ప్రయోజనం చేకూరడం లేదనే అభ్యంతరాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. అచ్చంపేట నియోజకవర్గంలోని మన్నెవారిపల్లి, చౌటపల్లిగ్రామాల మధ్య డిండి వాగు పొంగినప్పుడంతా దాని చుట్టుపక్కల ఉన్న 8గ్రామాల ప్రజలకు మూడు నుంచి నాలుగు రోజుల పాటు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ వంతెన పూర్తైతే ఈ ప్రాంత ప్రజలకు దేవరకొండకు వెళ్లి రావడానికి 20 నుంచి 30కిలో మీటర్ల దూరభారం తగ్గుతుంది.

సిర్సవాడ బ్రిడ్జికి టెండర్లు ఎప్పుడో?

జిల్లాలో మరో ప్రధానమైన ప్రాంతం సిర్సవాడ. తిమ్మాజిపేట, తాడూరు, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌ మండలానికి దాదాపు 20గ్రామాలకు దూరభారాన్ని తగ్గించే సిర్సవాడ బ్రిడ్జి నిర్మాణానికి 20కోట్ల 20లక్షల రూపాయలు మంజూరైన ఇప్పటి వరకు టెండర్లు పూర్తి కాలేదు. సిర్సవాడ వద్ద దుందుభి నది పొంగితే ఈ ప్రాంత ప్రజలు చుట్టూ 50కిలో మీటర్లు తిరిగి తాము అనుకున్న ప్రదేశాలకు చేరుకోవాల్సి వస్తుంది. దుందుభీ వాగు ఉధృతి కారణంగా వానకాలంలో తరచూ ప్రాణనష్టం జరుగుతూ వస్తున్నది.

ఇంకా ఎన్నాళ్లు..?

- దుందుభీ వాగులో 350 మీటర్లు వంతెన - రూ.30 కోట్ల నిధులు మంజూరు

ఉప్పునుంతల, (ఆంధ్రజ్యోతి): వానకాలం వచ్చిందంటే వరద ప్రవాహం తో దుందుభీ వాగుపై ఉన్న వంతెన పరవళ్లు తొక్కుతుండటంతో ప్రయాణికు ల రాకపోకలు ఇంకా ఎన్నాళ్లు చేయా లని నియోజకవర్గం ప్రజలు ప్రశ్నిస్తున్నా రు. నియోజకవర్గంలోని ఉప్పునుంతల, వంగూరు మండలాల సరిహద్దులోని మొల్గర- ఉల్పర వద్ద దుందుభీ వాగులో ఉన్న 350 మీటర్ల వంతెన వానాకాలం లో రోజుల తరబడి నీరు ప్రవహిస్తుం ది. దీంతో ఉప్పునుంతల, వంగూర్‌ మం డలాల ప్రజల రాకపోకలకే కాక అచ్చం పేట నుంచి హైదరాబాద్‌ వెళ్లే ప్రయా ణికులకు రాకపోకలకు తీవ్ర అంతరా యం కల్గుతుందని నియోజకవర్గ ప్ర జ లు చెప్తున్నారు. వానకాలం వచ్చిం దంటే దుందుభీ వాగులోని వంతెనపై నీళ్లు ప్రవహిస్తుండటంతో హైదరాబాద్‌ వెళ్లే వాహనదారులు డిండి చింతపల్లి, డిండి హైవేపై వెళ్లవల్సి వస్తుంది. దీంతో సమయంతో పాటు అదనంగా మరో 10 కి.మీ దూరం ప్రయాణం చేయాల్సి వ స్తుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానకాంలో వంతెన దాటేం దుకు వెళ్లి ఎంతో మంది ప్రయాణికులు గాయపడిన సంఘటనలు ఉన్నాయి. దుందుభీ వాగుపై బ్రిడ్జి నిర్మాణం కో సం ప్రభుత్వం రూ. 30 కోట్ల నిధులు మంజారు చేసి ఏళ్లు గడస్తున్నా నేటికీ బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభం కాక పోవడంతో ఎప్పుడు పనులు చేస్తారని మండల ప్రజలు విమ్మరిస్తున్నారు. దుం దుభీ వాగులో పనులు చేయాలంటే వేస విలో అనుకూలమైన సమయమని, వా నాకాలంలో దుందుభీ నీటితో పారుతుం టే పనులు ఎలా చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

త్వరగా బ్రిడ్జి ఏర్పాటు చేయాలి

త్వరగా బ్రిడ్జి ఏర్పాటు చేయాలి. వాన కాలం వచ్చిందంటే దుందుభీ వాగులో నీ టి ప్రవాహం ఉంటుంది. వంతెనపై వె ళ్లాలంటే వాహనాలు జారీ నీటిలో కొట్టు కపోయి వేల రూపాయలకు రిపేర్లు ఖ ర్చు అవుతుంది. అదే విదంగా వంతెనపై ప్రయాణికులు కాలినడకతో రాకపోకలు కొనసాగించి ఎంతో మంది ప్రయాణికులు గా యాలైపాలైన సంఘట నలు ఉన్నాయి.

- విష్ణు, ఉప్పరిపల్లి

ప్రారంభానికే సరి

వంగూరు,(ఆంధ్రజ్యోతి): వంగూరు-ఉప్పునుంతల మండ లాల మధ్య ప్రవహించే దుందుభీ నదిపై ఉల్పర వద్ద బ్రిడ్డి నిర్మాణం ప్రారంభానికే పరిమితమైంది. బ్రిడ్జి అవసరాన్ని గుర్తించి రెండు సంవత్సరాల కిందట అధికారులు ప్రతిపాదనలు రూపొందించా రు. బ్రిడ్జి నిర్మాణానికి సెప్టెంబరు 2023లో ప్రభుత్వం నుంచి రూ, 30 కోట్లు మంజూరయ్యాయి. 2023 సెప్టెంబరులో అప్ప టి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వంతెన పనులను ప్రారంభించారు. నేటికీ ఏడాదిన్నర అవుతున్నా వంతెన నిర్మాణ పనులు ప్రారంభానికి మాత్రమే పరితమయ్యాయి.

ఉల్పర వద్ద..

ఉల్పర వద్ద డిండి వాగుపై బ్రిడ్డి లేదు. డిండి వాగు ప్రవహిస్తున్నప్పుడు రాకపోకలు నిలిచిపో వాల్సిందే. అచ్చంపేట వయా ఉల్పర మీదు గా కల్వకుర్తి మార్గంపై దారులు నిలిచిపోతాయి. ఉల్పర, కోనాపూర్‌ రంగాపూర్‌, మిట్టసదగోడు గ్రామాల నుంచి వాగు అవుతల ఉన్న మొల్గర పక్క గ్రామాలకు వె ళ్లాలంటే చుట్టూ తిరిగి పోవాల్సిందే, వర్షాకాలంలో ఒక్కోసారి 3 నెలలు రాకపోకలు నిలిచిపోతుంటాయి.

వంతెన నిర్మాణం...

వాగులో పునాదులు తీసేందుకు సర్వే చేశారు. 300 మీటర్ల పొడ వు, 7.5 మీటర్ల వెడల్పు 4 మీటర్ల ఎత్తు వంతెన నిర్మించాల్సి ఉంది. 13 ఫిల్లర్స్‌ నిర్మించాల్సి ఉంది.పనులు పునాదులు కూడా నోచుకోలేదు.

పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం

ఉల్పర వద్ద బ్రిడ్జి నిర్మాణం చేయడానికి రూ.30 కోట్లు మంజూర య్యాయి. గత సంవత్సరం సెప్టెంబరులో పనులు ప్రారంభించిన మాట వాస్తవమే. టెండర్‌ కూడా పూర్తయింది. కానీ కాంట్రాక్టర్‌ అగ్రిమెంట్‌ చేసుకోలేదు. దీంతో పనులు జరగడం లేదు. తొందరలోనే పనుల వేగవంతానికి చర్యలు తీసుకుంటాం.

- లక్ష్మిపతి, ఆర్‌అండ్‌బీ ఏఈ

కలయేనా..?

- పట్టించుకోని అధికారులు

- వాగుకు వరద వచ్చిందంటే గ్రామాలకు రాకపోకలు బంద్‌

కోడేరు, (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండల కేంద్రంలో వాగు లపై వంతెన నిర్మాణం కోసం ప్రజాప్రతినిధులు నిధులు మంజూరు చేసినా పూర్తికావ ట్లేదు. వంతెనలు అవసరమని తెలిసినా వాగులపై నిర్మాణం చేపట్టడం లేదు. వర్షాకాలం లో వాగులు వంకలు పారుతున్న సందర్భంలో గ్రామాలకు గ్రామాలు రాకపోకలు కట్‌ కావడమే గాక వ్యవసాయదారులు తమ పొలాలకు వెళ్తూ ప్రమాదాలకు గురై చినిపో యిన సంఘటనలు ఉన్నాయి. వరదలకు ట్రాక్టర్లు బైకులు, మనుషులు కొట్టుకుపోయిన సందర్భాలూ కోకొల్లలు. కోడేరు మండల కేంద్రంలో బావాయిపల్లి వాగుపై వంతెన నిర్మాణం కోసం గత ప్రభుత్వం చేపట్టగా వదిలేశారు. నాగులపల్లి వాగుపై రెండు కోట్ల పది లక్షల రూపాయలు మంజూరు కాగా, గుత్తేదారులు పని ప్రారంభించి పిల్లర్ల వరకు పోసి మధ్యనే వదిలేశారు. కోడేరు పసుపుల మధ్యన వాగుపై వంతెన అవసరమని తెలి సిన అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. వాగులు వరదలు వస్తే వా గులు దాటడానికి రాక వరదలకు కొట్టుకుపోయిన సంఘటనలు ఉన్నాయి. ఆ స మయంలో వాగు దాటవద్దని పోలీసుల పహా రా చేపడుతూ దారులకు కంప చెట్లు, రాళ్లు అడ్డంగా పెట్టి రాకపోకలను అడ్డుకుంటారు కానీ వ్యవసాయ దారులు, ప్రయాణికులు వెళ్ల డానికి రాక తమ వ్యవసాయ పనులకు ఆటంకం కలుగు తుంది. అధికారులు స్పందిం చి వాగులపై వంతెనల ని ర్మాణం పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - May 11 , 2025 | 11:15 PM