బ్రిడ్జి నిర్మాణ స్థలం మార్పు తగదు
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:40 PM
జూరాల ప్రాజెక్టు దిగువన రేవులపల్లి- నందిమల్ల మధ్యలో కృష్ణానదిపై నిర్మించ త లపెట్టిన హైలెవల్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణ స్థలం మార్పు తగదని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ రంజిత్‌కుమార్ అ న్నారు.
ఎన్‌హెచ్‌పీఎస్ పోరుకు మద్దతు తెలిపిన సీపీఐ నాయకులు
గద్వాల టౌన్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జూరాల ప్రాజెక్టు దిగువన రేవులపల్లి- నందిమల్ల మధ్యలో కృష్ణానదిపై నిర్మించ త లపెట్టిన హైలెవల్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణ స్థలం మార్పు తగదని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ రంజిత్‌కుమార్ అ న్నారు. స్థలం మార్పునకు వ్యతిరే కంగా సమీప గ్రామాల ప్రజలు చేపట్టిన పోరాటానికి తమపార్టీ పూర్తిగా అం డగా ఉంటుందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజ నేయులు తెలిపారు. బ్రిడ్జి స్థలం మార్పును వ్య తిరేకిస్తున్న ఏడు గ్రామాల ప్రజలు మంగళవారం గద్వాల పట్టణంలోని ఎన్‌హెచ్‌పీఎస్ కార్యాలయం వద్ద రంజిత్ కుమార్‌ను, సీపీఐ కార్యాలయంలో కార్యదర్శి ఆంజనేయులును కలిసివినతిపత్రాలు ఇచ్చారు. ఈసందర్బంగా ప్రజల పోరాటానికి పూర్తిగా మద్దతు ప్రకటించిన నాయకులు, కృ ష్ణానదిపై కొత్తగా ప్రతిపాదిస్తున్న కొత్తపల్లి (గద్వాల జిల్లా), ఆత్మకూరు(వనపర్తి జిల్లా) స్థలం కన్నా గతంలోనే ప్రతిపాదించిన రేవులప ల్లి- నందిమల్ల గ్రామాల మధ్యనే బ్రిడ్జి నిర్మించ డం వల్ల అన్నివిధాలా సౌకర్యం ఉంటుంద న్నారు. గద్వాల జిల్లా నుంచి నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాలకు దూరం తక్కువగా ఉండే ప్రాంతం రేవులపల్లి- నందిమల్ల బ్రిడ్జి మాత్రమే అనుకూలంగా ఉంటుందని, కొత్తప ల్లి వద్ద నిర్మించడం వల్ల ఎలాంటి మెరుగైన సౌకర్యం ఉండదన్నారు. కృష్ణానదిపైనే ఎగువన దేవసూగూరు (కర్ణాటక) వద్ద ఉన్న బ్రిడ్జి, దిగువన బీచుప ల్లి వద్ద ఉన్న బ్రిడ్జిల మధ్య దూరం ఎక్కువగా ఉన్నందున రేవులపల్లి- నందిమల్ల మధ్యలో ని ర్మించడమే అన్నివిధాలా సౌకర్యం ఉంటుంద న్నారు. దీనివల్ల జూరాల ప్రాజెక్టుపై వాహనాల రద్దీ తగ్గి ప్రాజెక్టుకు రక్షణ లభిస్తుందన్నారు. వి నతిపత్రాలు ఇచ్చిన వారిలో రేవులపల్లి, భూం పురం, ఉప్పేరు, చింతరేవుల, ఓబులోనిపల్లి గ్రామాలకు చెందిన ఉన్నారు.