Share News

బ్రిడ్జీల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Aug 20 , 2025 | 11:33 PM

ప్రజల రవాణా సౌకర్యం మెరు గుపరిచేందుకు చేపట్టిన బ్రిడ్జీల నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలని

  బ్రిడ్జీల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
బున్యాధిపురం-జానంపేట గ్రామాల మధ్యన అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి పనులను పరిశీలిస్తున్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి

- ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి

పెబ్బేరు రూరల్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ప్రజల రవాణా సౌకర్యం మెరు గుపరిచేందుకు చేపట్టిన బ్రిడ్జీల నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలని ప్రణాళి కా సంఘం ఉపాధ్యాక్షుడు డాక్టర్‌ చిన్నారెడ్డి అధికారులకు సూచించారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని బున్యాధిపురం-జానంపేట గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణ పనులు రూ.2 కోట్లతో చేపట్టి మధ్యలోనే వదిలేశారు. ఈ బ్రిడ్జి అసంపూర్తిగా ఉండటంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటం తో ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్రిడ్జి పనులు అసంపూర్తిగా ఉండటానికి గల కారణాలపై అధికారులతో సమీ క్ష నిర్వహించి త్వరలోనే పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి యాదయ్య, జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌యాదవ్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2025 | 11:33 PM