Share News

పోషకాహార లోపంతోనే తల్లిపాల కొరత

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:48 PM

పౌషకాహా ర లోపంతోనే తల్లిపాల కొరత ఏర్పడుతుందని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు. సుశేష హెల్త్‌ ఫౌండేషన్‌ వారి సహకారంతో జనర ల్‌ ఆసుపత్రిలో సమగ్ర లాక్టేషన్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌, మదర్‌ మిల్క్‌ బ్యాంకులను ఏర్పాటు చేశారు.

 పోషకాహార లోపంతోనే తల్లిపాల కొరత
ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం

మహబూబ్‌నగర్‌(వైద్యవిభాగం), ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): పౌషకాహా ర లోపంతోనే తల్లిపాల కొరత ఏర్పడుతుందని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు. సుశేష హెల్త్‌ ఫౌండేషన్‌ వారి సహకారంతో జనర ల్‌ ఆసుపత్రిలో సమగ్ర లాక్టేషన్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌, మదర్‌ మిల్క్‌ బ్యాంకులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఆమె తో పాటు మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్‌ విజ యేందిర బోయిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి కాన్పు అయ్యే వరకు బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం లేదని, ఫలితంగా రక్తహీనత, కాన్పు సమయంలో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అంతేకాకుండా మాతా శిశు మరణాలు కూడా పెరుగుతున్నా యన్నారు. ఆసుపత్రిలో బరువు తక్కువగా పుట్టిన పిల్లలకు, పాలు రాని తల్లులను దృష్టిలో ఉంచుకొని సమగ్ర లాక్టేషన్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌, మదర్‌ మిల్స్‌ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన సుశేష పౌండేషన్‌కు అభినందనలు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మొదట హైదరాబాద్‌లో, రెండోది మహబూబ్‌నగర్‌లోనే ఏర్పా టు చేయడం గర్వకారణమన్నారు. మహబూబ్‌నగర్‌ చుట్టుపక్కల నుంచి తల్లిపాలను సేకరించడానికి అంబులెన్సును తన నిధుల నుంచి ఇప్పిస్తా నని ఎంపీ తెలిపారు. జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సం పత్‌కుమార్‌ సింగ్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కృష్ణ, పిల్లల విభాగాధిపతి డాక్టర్‌ సురేష్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీలత, ఆర్‌ ఎంవోలు డాక్టర్‌ శిరీష, డాక్టర్‌ జరీనా, డాక్టర్‌ దుర్గ, యూనిసెఫ్‌ చీఫ్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జలాలం, పెగా సిస్టమ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ దీపక్‌ విశ్వేశ్వర్‌, సీఎస్‌ఆర్‌ మెంబర్‌ ధరణికోట సుయోధన, సుశేష ఫౌండేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాస్‌, డైరెక్టర్‌ ఉదయశంకర్‌రాజు, సీనియర్‌ పబ్లిక్‌ హెల్త్‌ స్పెషలిస్టు డాక్టర్‌ సంతోష్‌, స్టేట్‌ మదర్‌ మిల్క్‌ బ్యాంకు ప్రోగ్రాం ఆఫీసర్‌ రమేష్‌, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 11:48 PM