బీపీ మండల్ మహోన్నతమైన వ్యక్తి
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:43 PM
బిందేశ్వర్ ప్రసాద్ మండల్ మహోన్నతమైన వ్యక్తి అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి
పాలమూరు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : బిందేశ్వర్ ప్రసాద్ మండల్ మహోన్నతమైన వ్యక్తి అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్‌తో కలిసి జిల్లా కేంద్రంలోని గ్రీన్‌బెల్ట్ ఏరియాలో బీపీ మండల్ విగ్రహాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. బీపీ మండల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిజర్వేషన్లకు అనుగుణంగా జాతీయ అధ్యక్షుడిగా ఉంటూ ఆనాడు ఏర్పరచినటువంటి 27శాతం రిజర్వేషన్ నేటికీ అమలు కావడం లేదా? ఆ చరిత్రను మనమంతా చెప్పుకోవాలన్నారు. దూర దృష్టితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఇచ్చిన మాటపై తెలంగాణలో రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నిన్నటి జీవో 9 ప్రకారం అర్డినెన్స్ జారీ చేయడం సంతోషం కలిగించిందన్నారు. ఆనాడు మునిసిపల్ కౌన్సిల్ రూ.5 లక్షల నిధులు ఇవ్వటంతో వాటిని యాదవ పెద్దలు ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, శాంతన్న, అల్లి సాయిలు ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం సంతోషంగాఉందన్నారు. మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, మల్లు నరసింహరెడ్డి, సిరాజ్‌ఖాద్రి, శ్రీనివాస్‌యాదవ్, పెద్దగొల్ల నరసింహులు, రాములుయాదవ్, మాజీ కౌన్సిలర్స్ పాషా, రాషెద్‌ఖాన్, అంజద్ పాల్గొన్నారు.