Share News

ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో సెమిస్టర్‌ పరీక్షల బహిష్కరణ

ABN , Publish Date - May 05 , 2025 | 11:09 PM

మూడేళ్లుగా తమకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు సెమిస్టర్‌ పరీక్షలను బహిష్కరించా యి.

ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో సెమిస్టర్‌ పరీక్షల బహిష్కరణ

వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసిన పాలమూరు వీసీ

గద్వాల సర్కిల్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): నేటి (మంగళవారం) నుంచి పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలలో డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మూడేళ్లుగా తమకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు సెమిస్టర్‌ పరీక్షలను బహిష్కరించా యి. ఈ విషయమై ఇప్పటికే పాలమూరు యూ నివర్సిటీ వీసీకి కళాశాలల ప్రతినిధులు వినతిపత్రం కూడా అందజేశారు. గతనెల 28న జరగాల్సిన పరీక్షలను ఒకసారి వాయిదా వేసిన పరిస్థితుల్లో రెండోసారి వాయిదాకు యూనివర్సిటీ నుంచి స్పందన రాకపోవడంతో మంగళవారం నుంచి జరగాల్సిన పరీక్షలను కూడా రాష్ట్ర ప్రైవేట్‌ కళాశాలల మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ పిలుపుమేరకు బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్న కారణంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ మంగళవారం నుంచి ప్రారంభమయ్యే సెమిస్టర్‌ పరీక్షలను రెండో సారి వాయిదా వేస్తూ సోమవారం రాత్రి ఆ దేశాలు జారీ చేసినట్లు గద్వాలలోని ఎంఏఎ ల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కలందర్‌పాషా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షల తేదీలను ఇంకా ఖరారు చేయలేదని పేర్కొన్నారు. డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలను వాయి దా వేసిన విషయాన్ని విద్యార్థులు గమనించాలని సూచించారు.

ఇప్పటికే చేరుకున్న పరీక్షల బుక్‌లెట్స్‌..

మంగళవారం నుంచి ప్రారంభం కానున్న డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్స్‌ పరీక్షలకు సంబంధించి పాలమూరు యూనివర్సిటీ నుంచి బుక్‌లెట్స్‌ ఇతర సామగ్రి ఆయా కళాశాలల కు చేరుకున్నాయి. జిల్లాలో మూడు ప్రభుత్వ కళాశాలలు, ఎనిమిది ప్రైవేట్‌ కళాశాలలుండగా... ప్రభుత్వ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల ప్రిన్సిపాల్స్‌ మాత్రమే బుక్‌లెట్స్‌, తదితర సామగ్రిని స్వాఽధీనం చేసుకోగా, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల యాజమాన్యా లు మాత్రం ముందస్తుగా పరీక్షలను పరీక్షల ను బహిష్కరించిన నేపథ్యంలో కళాశాలల కు తాళం వేశారు. కాగా వీసీ తీసుకున్న వాయిదా నిర్ణయంతో విద్యార్థులు, కళాశాలల మధ్య నెలకొన్న సందిగ్ధతకు బ్రేక్‌ పడినట్లయ్యింది.

Updated Date - May 05 , 2025 | 11:09 PM