చేపల వేటకు వెళ్లి బాలుడి గల్లంతు
ABN , Publish Date - Nov 05 , 2025 | 11:09 PM
గద్వాల మండల పరిధిలోని రేకులపల్లి వద్ద చేపల వేటకు వెళ్లిన సలీం(15) గల్లంతైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.
గద్వాల, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): గద్వాల మండల పరిధిలోని రేకులపల్లి వద్ద చేపల వేటకు వెళ్లిన సలీం(15) గల్లంతైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై శ్రీకాంత్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని బీడి కాలనీకి చెందిన సలీం ఉదయం చేపల గాలం తీసుకొని రేకులపల్లి వద్ద ఉన్న గుండాల జలపాతం వద్దకు వెళ్లాడు. గాలం వేసే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడిపోయాడు. విష యం తండ్రి మౌలాలికి తెలియడంతో కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లారు. రాత్రి కావడంతో వెనుతిరిగి వచ్చి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యా దు చేశారు. గల్లంతైన సలీం కోసం ఉదయమే జాలర్లతో గాలింపు చర్యలు చేపడుతామని ఎస్‌ఐ తెలిపారు.